పూనం కౌర్‌పై ఎవరు నిజం: చంద్రబాబా, మంత్రి కొల్లు రవీంద్రనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ చేనేత అంబాసిడర్‌గా సినీ నటి పూనమ్ కౌర్ నియామకం జరిగినట్లా, లేదా అనే సందేహం తలెత్తుతోంది. పూనమ్ కౌర్‌ను చేనేత అంబాసిడర్‌గా నియమించలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల చెప్పారు.

Poonam Kaur Issue : పూనం కౌర్‌ సంచలనం : మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

పూనం కౌర్‌పై మంత్రి కొల్లు సంచలనం: మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

అయితే, పూనమ్ కౌర్‌ను చేనేత అంబాసిడర్‌గా నియమిస్తున్న అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసలు ఆమె నియామకం జరిగినట్లా, లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

చంద్రబాబు ఇలా ప్రకటించారు...

చంద్రబాబు ఇలా ప్రకటించారు...

పూనమ్ కౌర్‌ను చేనేత అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఓ బహిరంగ వేదికపై చంద్రబాబు ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు ప్రకటనకు పూనమ్ కౌర్ ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. అయితే, అధికారికంగా పూనమ్ కౌర్ నియామకం జరగలేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 అప్పటి చంద్రబాబు ప్రకటన ఇదీ...

అప్పటి చంద్రబాబు ప్రకటన ఇదీ...

చేనేత పరిరక్షణకు చురుగ్గా పరిశోధన చేస్తున్న పూనమ్ కౌర్‌ ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. పూనమ్ కౌర్‌ను చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ ఓపెన్ స్నూకర్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్రారంభ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఈ సమావేశానికి పూనమ్ కౌర్ కూడా హాజరయ్యారు.

బరాక్ ఒబామాకు పూనం కౌర్ కానుక

బరాక్ ఒబామాకు పూనం కౌర్ కానుక

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గగా పూనమ్ కౌర్ అనంతపురంలో సందడి చేశారు కూడా తన పూట్టిన రోజు సందర్భంగా ఆమె సామజికుల చెంతకు చేరి వారి బాగోగులను ప్రత్యక్షంగా చూశారు. అంతేకాకుండా, బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఆమె ఆమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు చేనేత వస్త్రాలు కానుకగా కూడా ఇచ్చారు.

కొల్లు రవీంద్ర ప్రకటన ఇదీ...

కొల్లు రవీంద్ర ప్రకటన ఇదీ...

తాను చేనేత శాఖ మంత్రిగా ఉన్న కాలంలో చేనేత బ్రాండ్ ్అంబాసిడర్‌గా ఎవరినీ నియమించలేదని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రభుత్వపరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చనే జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని వివరిచారు. అంతకు మించి చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని మంత్రి చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It seems that Andhra Pradesh minister Kollu Ravindra was contadicting CM Nara Chnadrababu Naidu on Poonam Kaur as brand amabassador.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి