సుద్దాల అశోక్ తేజకు కొమరం భీం నేషనల్ అవార్డు
హైదరాబాద్: కొమరం భీమ్ స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజా ఆర్ట్స్ సంయుక్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్న కొమరం భీం జాతీయ పురస్కారం - 2014వ సంవత్సరానికిగాను ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను ఎంపిక చేశారు.

గత సంవత్సరం ఈ అవార్డును సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్‌కు ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ అవార్డు ఉత్సవాన్ని క్రమం తప్పకుండా ఈ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. గిరిజన హక్కుల కోసం, జల్-జంగల్-జమీన్ కోసం అనుక్షణం పోరాడి నిజాం సైనికుల కాల్పుల్లో అసువులు బాసిన గొప్ప పోరాట యోధుడు కొమరం భీం.

అతని స్మారకంగా నాటికలు, సీరియళ్లు, లఘు చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తూ కొమరం భీం ఆశయాలను పలు విధాలుగా ప్రచారం చేస్తోంది.
పలు అభ్యుదయ గేయాల ద్వారా, సామాజిక రచనల ద్వారా డాక్టర్ సుద్దాల అశోక్ తేజ కొమరం భీం ఆశయ సాధనలో కృషి చేస్తున్నందు వల్ల ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 3వ వారంలో రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. ఈ అవార్డు కింద రూ.50,116 నగదు, జ్ఞాపిక, శాలువా, సన్మానపత్రంను సుద్దాల అశోక్ తేజకు అందిస్తారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications