వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌తో కొండా సురేఖ భేటీ: వేరుగా ఇరు ప్రాంతాల టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ రాజకీయ పార్టీ నాయకురాలు కొండా సురేఖ గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న సురేఖ ఆ పార్టీ సమైక్య నినాదం తీసుకోవడంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైదరాబాదులో సమైక్య శంఖారావాన్ని తలపెట్టింది. దీనిపై ఆమె బుధవారం స్పందించారు. వైయస్ జగన్ హైదరాబాదులో సభ పెట్టడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా హైదరాబాదులో సమైక్య సభ పెట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. సభ ఉద్రిక్తలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ రోజు సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర రావు ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

టిడిపి నేతల వేర్వేరు భేటీలు

తెలుగుదేశం పార్టీ తెలంగాణ, సీమాంధ్ర నాయకులు టిడిఎల్పీలో గురువారం వేరువేరుగా భేటీ అయ్యారు. సీమాంధ్ర నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికీ తీసుకు వెళ్లాల్సిన అంశాలపై చర్చించగా, టిటిడిపి నేతలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు నేతలు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఈ రోజు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలుస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆంటోని కమిటీ రాష్ట్రంలో పర్యటించకుండానే, ఎవరిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడమేమిటని ప్రశ్నించారు.

English summary
Former Minister Konda Surekha and her husband Konda Muralidhar Rao met CM Kiran Kumar Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X