రాజధానిపై డొక్కా కొత్త వాదన: సిఎంపై ఐటి ఐకాస ఫైర్

తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలు, కవులను గుర్తు చేసే చారిత్రక నేపథ్యం ఉన్న కొండవీడు, అమరావతిని సీమాంధ్ర రాజధానిగా చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
కిరణ్‌పై టి ఐటి ఐకాస ఆగ్రహం
ఐటీ రంగంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదనలు సరికాదని తెలంగాణ స్టేట్ ఐటి ఐక్యకార్యాచరణ సమితి ఆరోపించింది. ఐటి, ఫార్మారంగాల్లో 90 శాతం హైదరాబాద్ వారే ఉన్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పడాన్ని ప్రస్తావించారు. ఐటి, ఫార్మా రంగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించినవని, ఇందులో అవకాశాలు మెరిట్ ప్రాతిపదికనే లభిస్తాయన్నారు.
విశ్వ విద్యాలయాల విషయంలోనూ సీమాంధ్రలో 21 ఉంటే, తెలంగాణలో 13 మాత్రమే ఉన్నాయన్నారు. ఐఐటి, ఐఎస్‌బి, హెచ్‌సియూ వంటి విశ్వవిద్యాలయాల ప్రవేశాలు జాతీయ స్థాయిలో ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి సీమాంధ్ర విద్యార్థులకు ఎలా సమస్యలు వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలోనూ సిఎం అప్రజాస్వామికంగా మాట్లాడారన్నారు.
ఉమ్మడి రాజధానిని ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరమితం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం, మునగాల ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే నైతిక హక్కు ఆ ప్రాంతం వారికి లేదన్నారు. తెలంగాణ నీరు, బొగ్గును తరలించుకుని సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం వల్లే ఇక్కడ సమస్య ఏర్పడిందన్నారు. కృష్ణా జలాల పంపకంపై స్పష్టత ఉందన్నారు.












Click it and Unblock the Notifications