చేయిచ్చారా: అపస్మారకస్థితిలో ఎమ్మెల్యే అభ్యర్థి కొండేటి

వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెసు అభ్యర్థి కొండేటి శ్రీధర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేగా మరోసారి ఎస్సీ నియోజక వర్గమైన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి బరిలోకి దిగారు.

ఆయన ఆత్మహత్యాయత్నంపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కీలక సమయంలో పెద్దలు చేయిచ్చారని, పార్టీ ఫండ్ ఇవ్వలేదని, మీడియా బెదిరింపులని... ఇలా పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొండేటి శ్రీధర్ వరంగల్, కరీంనగర్ జిల్లా సరిహద్దు నాగారం - అంబాల గ్రామాల మధ్య విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలోని మామిడితోటలో నిద్రమాత్రలు వేసుకొని స్పృహతప్పి పడిపోయారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారు.

Kondeti Sridhar suicide attempt

శ్రీధర్ తెరాసకు మూడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని కొందరు దుష్ప్రచారం చేయడం, అది ఓ ఛానల్లో స్క్రోలింగ్ చూసి పోలీసులు శ్రీధర్ ఇంటిమీద దాడులు కూడా జరిపినట్లుగా వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత అతను మామిడితోటల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

మరోవైపు ఎన్నికలు మరికొన్ని గంటల్లోకి వచ్చినా.. పార్టీ ఆయనకు ఆశించినంత ఫండ్ ఇవ్వలేదని, తన ఆస్తులు అమ్మి ఇచ్చిన కోటి రూపాయలను సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, పెద్దల నుండి సహకారం లేదని ఆయన మనస్థాపం చెందారని అంటున్నారు. నమ్ముకున్న వారు మోసం చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+