వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా తండ్రి టిడిపిలో చేరొద్దన్నారు, బలమైన నేత: వైసిపిలోకి కోటగిరి శ్రీధర్

ఏ పార్టీలో అయినా చేరు కానీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరవద్దని తన తండ్రి కోటగిరి విద్యాధర రావు తనకు చెప్పారని కోటగిరి శ్రీధర్ ఆదివారం అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ద్వారకా తిరుమల: ఏ పార్టీలో అయినా చేరు కానీ, తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరవద్దని తన తండ్రి కోటగిరి విద్యాధర రావు తనకు చెప్పారని కోటగిరి శ్రీధర్ ఆదివారం అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో తన తండ్రికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.

జగన్ నాయకత్వంలో పని చేయాలని తన తండ్రి తనకు సలహా ఇచ్చారన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కోటగిరి శ్రీధర్ వైసిపిలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

<strong>చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక</strong>చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడారు. తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి శుభకార్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిందని, అందుకే పార్టీ చేరిక కూడా ఇక్కడే పెట్టుకున్నామ్నారు. తన తండ్రి ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారన్నారు.

ys jagan

2004లో తన తండ్రి ఓడిపోయిన వైయస్ గెలిచాడని సంతోషించాడన్నారు. తన తండ్రి చివరి రోజుల్లో.. టిడిపిలో తప్ప ఎక్కడైనా చేరాలని చెప్పారన్నారు. జగన్‌తో కలిసి పని చేయాలని తనకు సూచించారని చెప్పారు. చిన్న వయస్సులో జగన్ సమర్థవంతంగా పార్టీ నడిపిస్తున్నారన్నారు.

అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!

ఢిల్లీ నాయకుల ముక్కు పిండి పని చేయించుకోవాలంటే అందుకు బలమైన నాయకుడు కావాలని, అందుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. 12 ఏళ్లు తన తండ్రికి రాజకీయాల్లో సాయం చేసానని చెప్పారు.

ఈ సమయంలో తనకు చాలామందితో పరిచయం ఏర్పడిందన్నారు. తనకు కోపం లేదని, ఓర్పు ఉందని, సహనం ఉందని, హంగూ ఆర్భాటం లేదన్నారు. కార్యకర్తలు ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చునని చెప్పారు. విభజన జరిగినప్పుడు మనం బాధపడ్డామన్నారు.

English summary
Kotagiri Sridhar has joined in YSR Congress Party in the presence of YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X