"సింగిల్ చపాతీ బాబుకు ప్యాంట్రీ కారా?, పవన్ కల్యాణ్ గుర్తించారు"

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చే

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల వేళ నోట్ల కట్టలతో రోడ్లపై తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. అనుమానం ఉన్న వాహనాలను తనికీ చేయిస్తే టిడిపి నేతలకు ఉలుకు ఎందుకని ఆయన అడిగారు.

గాజులమెట్ట ఘటనలో చంద్రబాబు ప్యాంట్రీ కారును మాత్రమే తనిఖీ చేసి కారునూ బస్సులనూ చెక్ చేయకుండా వదిలేశారని ఆయన శనివారం నంద్యాలలో మీడియా సమావేశంలో విమర్శించారు.

తినేది సింగిల్ చపాతీనే కదా....

తినేది సింగిల్ చపాతీనే కదా....

రోజుకు ఒక్క చపాతీ మాత్రమే తినే చంద్రబాబుకు ప్రత్యేకంగా ప్యాంట్రీ కారు అవసరమా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. మూడున్నరేల్లు నంద్యాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు ఎన్నికల సమయంలో మళ్లీ ప్రజల ముందుకు వచ్చి అవే మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఒక్క ముస్లిం లేడు...

ఒక్క ముస్లిం లేడు...

మంత్రివర్గంలోకి ఒక్క ముస్లింను కూడా తీసుకోని చంద్రబాబు నంద్యాలలో ముస్లింలకు ఏదో చేస్తానని అనడం హాస్యాస్పదమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆయన అన్నారు. కాపులు, ముస్లింలు, మిగతావారంతా ఒక్కటై టీడిపిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆ వార్తే నిజమైంది...

ఆ వార్తే నిజమైంది...

నంద్యాలలో నోట్ల కట్టలు కుమ్మరించినా టిడిపి గెలువలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. టిడిపి అక్రమాలను కళ్లారా చూసిన ఓటర్లు రేు తలవంచుకుని పోలింగు బూత్‌కు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వైసిపి విజయమే ప్రపంచానికి నిజమైన వార్త అవుతుందని అన్నారు.

పవన్ కల్యాణ్ గుర్తించారు....

పవన్ కల్యాణ్ గుర్తించారు....

2014లో చంద్రబాబును నమ్మి పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని, మూడేళ్ల తర్వాత చంద్రబాబు మోసాలను పవన్ గుర్తించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న టిడిపికి దూరంగా జరిగారని చెప్పారు. పవన్ అభిమానులు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+