కేశినేని నానిని కొట్టి సారీ చెబుతా, 'నారాయణ'లోనే లీక్, వారు మాఫియా: కోటంరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాల లీకేజీ, అలాగే విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నాని హంగామాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం స్పందించారు.

చెవిరెడ్డి అరెస్ట్: అనుమతి లేకుండా ఏమిటని చంద్రబాబు ఆగ్రహం

మూడు రోజుల క్రితం రవాణా శాఖ కార్యాలయంలో ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఇతర టిడిపి నేతలు వీరంగం సృష్టించారని, దానికి కేవలం క్షమాపణతో సరిపెట్టారని కోటంరెడ్డి విమర్శించారు. మేం కూడా కేశినేని నానిని, బోండా ఉమను కొట్టి సారీ చెబుతామని, అలా అయితే సరిపోతుందా అని నిలదీశారు.

Kotamreddy Sridhar Reddy comments on TDP leaders hungama in Vijayawada RTO office

నారాయణ విద్యా సంస్థల్లోనే పదో తరగతి పేపర్ లీక్ అయిందని కోటంరెడ్డి అన్నారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణలు ఇద్దరు మాఫియాలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయం పార్టీ నేతలు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నేరానికి పాల్పడినవారు ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Kotamreddy Sridhar Reddy comments on TDP leaders hungama in Vijayawada RTO office.
Please Wait while comments are loading...