వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే లగడపాటి భూములు కొన్నారు: ఆమోస్

|
Google Oneindia TeluguNews

KR Amos
హైదరాబాద్/మెదక్: రాష్ట్రం విడిపోదంటూ సీమాంధ్ర ప్రజలను పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు కేఆర్ ఆమోస్ బుధవారం ఆరోపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని అంటున్న లగడపాటి రాజగోపాల్ గుంటూరు-ప్రకాశం మధ్య వేయి ఎకరాలు ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ఆ ప్రాంతంలోనే రాజధాని వస్తుందని లగడపాటి భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారని ఆమోస్ ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు ఇలాంటి మోసపూరిత నాయకుల మాటలు నమ్మకూడదని అన్నారు.

సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మెను ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే విరమింపజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఉందని అన్నారు. అసెంబ్లీ తీర్మానం అవసరం లేకుండా కేంద్రం తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుందని కేఆర్ ఆమోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌పై విచారణ జరిపించాలి: హరీశ్

మెదక్: రాష్ట్ర మాజీ డిజిపి దినేష్‌రెడ్డి వ్యాఖ్యల ఆధారంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీశ్ రావు డిమాండ్ చేశారు. దినేష్ రెడ్డి దగ్గర అవినీతికి సంబంధించిన ఆధారాలుంటే కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దినేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్ర ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

English summary
Congress MLC KR Amos said on wednesday that MP Lagadapati Rajagopal Purchased thousands of ecres land in Seemadhra because of after state division Seemandhra get another Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X