కృష్ణా కాల్పులు: ఢిల్లీలో ఏడుగురు నిందితుల అరెస్ట్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్దఅవుటపల్లిలో జరిగిన ముగ్గురి హత్య కేసులో ఏడుగురు నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, ఇందులో గోవింద్, శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారులని పోలీసులు చెప్పారు.
నిందితుల్లో నలుగురు కిరాయి హంతకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. లండన్‌లో ఉంటున్న గోవింద్ ముగ్గురి హత్య కోసం నిందితులకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం ఉందని పోలీసులు చెప్పారు. సుపారీ సుమారు రూ. కోటిపైనే ఉండవచ్చని తెలిపారు.

సెప్టెంబర్ 24వ తేదీన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వర రావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
అనంతరం నిందితుల కోసం హైదరాబాద్, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తు ముమ్మరంగా జరిపిన పోలీసులు హత్యకు సంబంధించి ఏడుగురు నిందితులను ఢిల్లీలో మంగళవారం అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications