విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తక్షణమే ఇటు దృష్టిసారించండి చంద్రబాబు ఆర్యా!?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తక్షణం ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతల వ్యవహారశైలి, వారి సరళిపై దృష్టిసారించాలని, పార్టీని రక్షించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. నాయకుల అంతర్గత కలహాలవల్ల పార్టీ గుడివాడలో నిర్వహించాలనుకున్న మినీ మహానాడును కూడా నిర్వహించలేకపోవడం దురదృష్టమని, చంద్రబాబు తన వైఖరిని విడనాడి నాయకులపై కఠిన చర్యలకు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

బీసీలకివ్వాలని బుద్ధా డిమాండ్

బీసీలకివ్వాలని బుద్ధా డిమాండ్

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని, ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని బుద్ధా డిమాండ్ చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, అతని సోదరుడు కేశినేని చిన్ని మధ్య వైరం పార్టీకి నష్టం చేకూర్చేదిగా తయారైంది. రానున్న ఎన్నికల్లో నానిని పశ్చిమ నుంచి పోటీచేయించాలని, చిన్నిని ఎంపీగా పోటీచేయించాలనే ప్రతిపాదన చంద్రబాబు దగ్గర ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన బుద్ధా వెంకన్న తనకు సీటివ్వాలని, లేదంటే బీసీలకివ్వాలంటూ డిమాండ్ చేయడం వెనక కేశినేని నానికి టికెట్ దక్కకుండా చేయాలనే ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేశినేని చిన్నికి మద్దతు పలుకుతున్న నేతలు..

కేశినేని చిన్నికి మద్దతు పలుకుతున్న నేతలు..

మాజీ మంత్రి దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నతోపాటు విజయవాడ నగరానికి చెందిన పలువురు నేతలు కేశినేని చిన్నికి మద్దతు పలుకుతున్నారు. బుద్ధా చేసిన వ్యాఖ్యలు కూడా చిన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనివే. అన్నదమ్ముల వైరం పార్టీకి నష్టం కలిగిస్తోందని, వెంటనే బాబు జోక్యం చేసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. గతంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభేదాలను పక్కనపెట్టి మినీ మహానాడు ఏర్పాటు చేయాలని సూచించారు. లేదంటే ఉపేక్షించేది లేదని, అవసరమైతే తాను కొత్తవారిని పార్టీలోకి తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగిన సమయంలో వీరంతా సరిగా స్పందించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు హెచ్చరికలు జారీచేశారు.

దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టమే?

దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టమే?


కేశినేని చిన్నికి ఎంపీ సీటివ్వాలంటూ ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నతోపాటు పలువురు నాయకులు చంద్రబాబును కోరుతున్నారు. ఇంకా సమయం ఉండటంతో చంద్రబాబు కూడా వేచిచూసే ధోరణికి రావాలని సిద్ధపడ్డారు. అయితే విభేదాలు ముదిరి రోజురోజుకు పార్టీ మీద ప్రభావం చూపిస్తుండటంతో తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కోరుతున్నారు.

English summary
The Telugu Desam Party chief Chandrababu Naidu immediately wants to focus on the behavior and style of the leaders of the joint Krishna District Telugu Desam and save the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X