Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరపైకి ‘సజ్జల’! పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఇటీవల అరెస్టయిన నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, వర్గాలపై తాను గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశానని పోలీసులు ముందు అంగీకరించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ కుటుంబసభ్యులను దూషించినట్లు పోసాని తెలిపారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని పోసాని కృష్ణమురళి చెప్పడం గమనార్హం. సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు మేరకే తాను విమర్శలు చేసినట్లు పోసాని చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు పోసాని తెలిపారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైసీపీకి మద్దతుగా వ్యవహరించానని పేర్కొన్నారు.

Krishna Murali claims he made those comments because of Sajjala Key points in remand report

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పవన్‌ను వ్యక్తితంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని, ఆయన అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు పోసాని పోలీసులకు తెలిపారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేసేవాడని పోసాని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు పోసాని కృష్ణమురళి చెప్పిన విషయాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు శుక్రవారం రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు. ఇటీవల అరెస్టయిన పోసానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు గురువారం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు, పోసానిని ఐదు రోజులపాటు కష్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

కాగా, పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నగరంలో బుధవారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై తీవ్రమైన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై పలు కేసులు నమోదయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+