తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు (ఫోటోలు)
అమరావతి: కృష్ణా పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండోరోజైన శనివారం తెల్లవారుజాము నుంచే పుష్కర ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శనివారం సెలవు కావడం, ఆదివారం, సోమవారం ఆగస్ట్ 15 కావడంతో వరుసగా మూడు రోజులు సెలవలు వచ్చాయి.
దీంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లను కూడా చేస్తోంది. శనివారం ఉదయాన్నే వివిధ జిల్లాల నుంచి వచ్చే యాత్రికులు పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు దగ్గరగా ఉన్న పద్మావతి, దుర్గాఘాట్‌కు చేరుకుని పుష్కరస్నానాలు ఆచరిస్తున్నారు.
పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశంతో ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శుక్రవారం తెల్లవారుజామున 5.40 గంటలకు వీఐపీ ఘాట్‌లో కృష్ణమ్మకు ప్రత్యేకపూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తొలుత కలశస్థాపన, కృష్ణవేణి స్థాపన, ఆవాహన, పూజా కార్యక్రమాలతో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వాములు తొలి పుష్కర స్నానం ఆచరించగా, ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర కుటుంబీకులు పుష్కర సాన్నం చేశారు.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
కాగా, కృష్ణ పుష్కరాలు తొలి రోజు వెలవెలబోయింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క ఘాట్ కూడా భక్తులతో కళకళలాడలేదు. తొలి రోజు భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ, ఆ మేరకు భక్తులు రాలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఘాట్‌లన్నీ ఖాళీగా కనిపించాయి.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
శుక్రవారం తెల్లవారుజామున కొన్ని ఘాట్‌లలో జనం ఒక మోస్తరుగా కనిపించారు. రానురాను భక్తుల సంఖ్య పెరుగుతుందని అనుకుంటే, పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఏ ఘాట్ చూసినా వెలవెలబోతూ కనిపించింది. విజయవాడలోని దుర్గా ఘాట్‌కు భారీ సంఖ్యలో భక్తుల రావల్సి ఉంది.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
ఇక్కడ పుష్కర స్నానాలు చేసి, అక్కడి నుంచి నేరుగా అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు వెళతారు. గతంలో ఏ పుష్కరాల్లో లేని విధంగా దుర్గా ఘాట్‌కు భక్తులు రాలేదని అక్కడున్న పురోహితులు చెపుతున్నారు. అలాగే పున్నమి ఘాట్, పద్మావతి ఘాట్, కృష్ణ వేణి ఘాట్‌లో ఏమాత్రం జనం కనిపించకపోవడం గమనార్హం.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
లక్ష మందికి పైగా ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నిర్మించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు స్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో ఉదయం తొమ్మిది గంటల వరకూ ఒక మోస్తరు జనం ఉన్నారు. ఆ తరువాత ఘాట్ మొత్తం ఖాళీ అయిపోయింది.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పవిత్ర నదీసంగమం వద్ద అతి కొద్దిమంది భక్తులు మాత్రమే స్నానం చేయడం గమనార్హం. ఇలా ఏ ఘాట్‌లో కూడా భక్తులు కనిపించలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం శ్రావణ శుక్రవారం.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
శ్రావణ శుక్రవారం రోజున మహిళలు ఇళ్ళలో లక్ష్మీ దేవి పూజ చేసుకున్నారు. అందువలన మహిళలు పుష్కర స్నానాలకు రాలేదు. గతంలో రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు తొక్కిసలాటలో పదుల సంఖ్యలో చనిపోయిన సంగతి తెలిసిందే.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
ఇది కూడా ఓ కారణంగా చెప్తున్నారు. మరోపక్క విజయవాడలో ఏర్పాట్లపై ప్రజల్లో అనుమానం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాలేదని చెపుతున్నారు. అంతేకాకుండా కృష్ణ నదిలో గోదావరి జలాలు కలిసినందువలన విజయవాడులో పుష్కర స్నానాలు చేయడానికి ఇష్టపడక కొంతమంది రాలేదని అంటున్నారు.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
తొలి రోజు పిండ ప్రదానాలు పెద్దగా జరగలేదు. కొద్దిమంది మాత్రమే పిండ ప్రదానాలు చేశారు. కాగా, చాలా ఘాట్‌లలో జనం లేకపోవడానికి పోలీసుల ఆంక్షలే కారణమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తొలిరోజు 4.51 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం చేసినట్లుగా ఉంది.

తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
తొలిరోజు వెల వెల: రెండో రోజుకు కృష్ణా పుష్కరాలు
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications