నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం: ఏపీ, తెలంగాణా అధికారుల హాజరు కష్టమే.. ఎందుకంటే!!
తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నేడు మరోమారు భేటీ కానుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరు అవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

నేడు కృష్ణా నదీ జలాశయాల పర్యవేక్షణ కమిటీ సమావేశం
కృష్ణానది యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షణ కమిటీ శ్రీశైలం, నాగార్జున సాగర్ లో జల విద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరద జలాల లెక్కలు, రూల్ కర్వ్స్ కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేయడం కోసం గతంలోనే ఆర్ఎంసి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో ఆ సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సమావేశాన్ని నేడు నిర్వహించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది.

సమావేశానికి హాజరు కాలేమని లేఖ రాసిన ఏపీ.. కారణం ఇదే
అయితే కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయాల పట్ల విముఖత ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేడు సమావేశానికి హాజరు అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. తాజాగా నేడు నిర్వహించనున్న ఆర్ ఎం సి ఐదవ సమావేశాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్ళై కన్వీనర్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, ఈరోజు సమావేశానికి హాజరు కావడం తమకు వీలుకాదని, మరోరోజు ఎప్పుడైనా సమావేశాన్ని నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశారు.

ఆర్ఎంసీ సమావేశంపై తెలంగాణా అసంతృప్తి
కాగా తెలంగాణ అధికారులు సైతం ఆర్ ఎం సి సమావేశానికి హాజరయ్యే దాఖలాలు లేవు. తెలంగాణ అధికారులు ఆర్ఎంసి సమావేశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనేకమార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తమ అభిప్రాయాలను తెలియజేసినా, తమ అభిప్రాయాలను పొందుపరచటం లేదని, కృష్ణా నదీ జలాలకు సంబంధించి తాము అడిగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని తెలంగాణ అధికారులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు తమ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వని, తమకు కావలసిన సమాచారం ఇవ్వని పక్షంలో తాము ఆర్ఎంసి సమావేశంలో పాల్గొనడం వల్ల ఫలితం ఏం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

కృష్ణా బోర్డుకు తెలంగాణా లేఖ... భేటీకి హాజరు కష్టమే!!
ఇక ఈ మేరకు వారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారశైలిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాశారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపరచటంతో పాటు కోరిన సమాచారాన్ని ఇచ్చిన తర్వాతే సమావేశం నిర్వహించాలని తెలంగాణ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల అధికారుల హాజరు అనుమానాస్పదంగా మారింది. కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నేడు జలాశయాల పర్యవేక్షణ కమిటీ భేటీ ఉంటుందని, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకావాలని పేర్కొంది. దీంతో అధికారులు ఈ సమావేశానికి వస్తారా? అధికారులు సమావేశానికి రాకుంటే కృష్ణానది యాజమాన్య బోర్డు ఏం చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications