ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు.. ఎలా వాడాలి.. ఫలితం ఉంటుందా..?
మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి. ఈనేపథ్యంలో నెల్లూరు జిల్లా కష్ణ పట్నంకు చెందిన ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు

ఒమిక్రాన్‌కు ముందస్తు మందు..
కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా మందును తయారు చేసినట్లు ఆనందయ్య తెలిపారు. ఈ వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శీతాకాలంలో ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఎక్కవగా ఉండే అవకాశం ఉందన్నారు. దీనికి ముందస్తుగానే తాను మందును తయారు చేసినట్లు పేర్కొన్నారు.

మందు వాడే విధానం
ఈమందును ముందస్తుగా ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవాలని ఆనందయ్య సూచించారు. దీనిని మార్చి మొదటి వారం వరకు వాడాల్సి ఉంటుందని తెలిపారు. మార్చి తర్వాత వచ్చే ఎండాకాలంలో ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వైరస్ విరుగుడు మందు అటు విశాఖలోనూ, ఇటు కృష్ణపట్నంలోనూ పంపిణీని చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం తన మొబైల్ నంబర్ 9100036881ని సంప్రదించాలని కోరారు ఆనందయ్య.

కరోనాకు మందు
గతంలో కూడా కరోనా వైరస్ విజృంభణ సమయంలో నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును పంపణీ చేశారు. ఈ మందు గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆనందయ్య మందు ఒక్క సారి బాగా పాపులర్ అయింది. ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం బారులు తీశారు.
మొదట్లో ఈ మందు పంపిణీకి ఏపీ సర్కార్ అనుమతించకపోవడంతో దీనిని కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఆయుర్వేద నిపుణుల పరిశీలన అనంతరం దీనిని పంపిణీకి అనుమతి లభించింది. దీంతో ఈ మందుకు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. ప్రజలు దీనికోసం క్యూలు కట్టారు. తాజాగా ఒమిక్రాన్ దూసుకోస్తున్న తరుణంలో ఆనందయ్య ఆయుర్వేద మందును ముందస్తుగానే తయారు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications