Krishnashtami 2023: శ్రీకృష్ణ జన్మాష్టమి రేపా, ఎల్లుండా - ఇలా తేల్చారు..!!

కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎప్పుడు జరుపుకోవాలి. ఈ ఏడాది ఈ పండుగ రెండు రోజుల్లో ఎప్పుడనే సందేహం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పంచాగ కర్తలు..పండితులు స్పష్టత ఇస్తున్నారు. భక్తుల్లో ఉన్న గందరగోళానికి తెర దించుతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో నక్ష్రతం..ప్రత్యేకత..సంప్రదాయం గురించి వివరిస్తున్నారు. జన్మాష్టమి సెలవు 6వ తేదీన ప్రకటించారు. మరి.. శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి..? దానికి గల కారణాలు ఏంటి..

కృష్ణాష్టమి వేడుకలు:కృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. ఈ పర్వదినాన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణాష్టమిగా వేడుకలు నిర్వహిస్తారు. అష్ఠమి రోహిణి అని కూడా పిలుస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ప్రతీ ఏటా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి నిర్వహిస్తారు.

Krishnashtami 2023: When is Krishna Janmashtami, Date and significance details here

అయితే, ఈ ఏడాది మాత్రం ఈ ముహూర్తంపైన కొంత గందరగోళం కొనసాగుతోంది. స్పష్టత కొరవడింది. ఈ సమయంలో జన్మాష్టమిని ఈనెల 6న జరుపుకోవాలని కొందరు, కాదు 7న జరుపుకోవాలని మరికొందరి అభిప్రాయం. అష్టమి తిధి రెండు రోజులను కలుపుతూ రావటమే ఈ అనుమానాలకు కారణం. వైదిక క్యాలెండర్ ప్రకారం జన్మాష్టమి కృష్ణపక్షం అష్టమి తిధి సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3. 27 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7న సాయంత్రం నాలుగు 14 గంటలకు ముగుస్తుంది.

పండుగ ఎప్పుడు:ఇక రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 6న ఉదయం 9:20 నుంచి మొదలై 7వ తేదీ ఉదయం 10. 25 గంటల వరకు ఉంటుంది. దీంతో స్మార్త సంప్రదాయం అనుసరించేవారు సెప్టెంబర్ 6న జన్మాష్టమి జరుపుకోవాలని చెబుతున్నారు. వైష్ణవులు సెప్టెంబర్ 7న నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే పండితులు కీలక సూచన చేస్తున్నారు. అరుణ జన్మాష్టమి వేడుకలు, సెప్టెంబర్ 7న ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించాలని సూచిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయానికి ఉన్న తిధిని బట్టి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. దీని ప్రకారం 7 ని శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించటం సమచితమనే అభిప్రాయం వినిపిస్తుంది.

Krishnashtami 2023: When is Krishna Janmashtami, Date and significance details here

పూజా సమయం:ధృక్ పంచాంగం ప్రకారం జన్మాష్టమి పూజా సమయం సెప్టెంబర్ 7 రాత్రి 11 57 నుంచి 12:42 వరకు ఉంటుంది. దీంతో జన్మాష్టమి నాడు పూజకు శుభ సమయం రాత్రి 11 5 గంటలకు మొదలవుతుంది. అర్ధరాత్రి 12 42 గంటల వరకు లడ్డు గోపాల్ జయంతి పూజలు ఉంటాయి.

సెప్టెంబర్ 7న సాయంత్రం 4. 14 గంటలకు ఉట్టి కొట్టి సమయంగా నిర్ధారించారు. కృష్ణాష్టమి నాడు భక్తులు ఇళ్లను అలంకరిస్తారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ రుచికరమైన వంటకాలు తయారుచేసి నైవేద్యం పెడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు ఈ పండగను ఉట్ల పండగ. ఉట్ల తిరణాలు అని కూడా పిలుస్తారు ఇక బ్యాంకులకు ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల ఆరో తేదీన కృష్ణాష్టమి సెలవుగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+