గన్నవరం టీడీపీ అభ్యర్ధిగా బరిలో దింపాలని - మాజీ మంత్రి కన్నబాబు..!!
టీడీపీ నుంచి గన్నవరం అభ్యర్ధిగా ఫోకస్ చేయాలనే ఇదంతా జరుగుతోందని కన్నబాబు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్..మద్దతు మీడియా పైన మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి జగన్ ను దించేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేది ఎల్లో మీడియా కోరికగా పేర్కొన్నారు. లోకేష్‌ను రాజకీయాల్లో బాహుబలిగా చూపించాలని ఎల్లో మీడియా తపనగా చెప్పుకొచ్చారు. లోకేష్‌ను పులి అని ఎల్లోమీడియా అనుకుంటుంటే.. పులకేశి అని జనం అనుకుంటున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు - లోకేష్ కొంత కాలంగా రోడ్ల మీద తిరుగుతున్నారని..ఈ క్రమంలోనే కొంత మంది నాయకులను తయారు చేసుకొనే పనిలో పడ్డారని పేర్కొన్నారు. అందులో పట్టాభిరాం అనే వ్యక్తిని ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఫొటోలతో వార్తలు ప్రచురుణ చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏపీలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ ఎమ్మెల్సీలను ఖరారు చేసారని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఎప్పుడూ చట్టసభల గడపతొక్కని కులాలకు ప్రాతినిథ్యం కల్పించారన్నారు. దీని నుంచి డైవర్షన్ చేయాలనే కుట్రతో గన్నవరం స్టంట్ స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. గన్నవరం, గుడివాడలో వంశీకి, కొడాలి నానికి దీటుగా అభ్యర్థులను అదే కమ్యూనిటీ నుంచి వెతుక్కునే పనిలో పడ్డారని చెప్పారు. పట్టాభిని గన్నవరం నుంచి అభ్యర్థిగా ఫోకస్ చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీలో భజన బృందాలు, తప్పెటగుళ్లు, గరగ నృత్యాల బ్యాచ్‌లు ఉన్నాయని కన్నబాబు ఎద్దేవా చేసారు.పట్టాభిని ఎవరూ కొట్టలేదని పోలీస్ అధికారులు చెబుతుంటే.. వైద్య పరీక్షల్లో ఎప్పుడో 36 గంటల క్రితం చేతికి చిన్న గాయం ఉందని వైద్యులు సర్టిఫై చేశారని వివరించారు.

కాళ్లు, చేతులకు గాయాలేమీ లేవని చెబుతున్నారన్నారు. వైద్యులు, పోలీసులు చెబుతుంటే దాన్ని పక్కనబెట్టి కొట్టేశారని ప్రచారం చేస్తున్నారని వివరించారు. పట్టాభి అనే వ్యక్తి జాతీయ నాయకుడిగా జాకీలు వేసి లేపుతున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా చేష్టలకు జనం నవ్వుకుంటున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు. సీపీఐ నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలపైన కన్నబాబు స్పందించారు. నారాయణ లాంటి వారి స్టేట్‌మెంట్లు, సర్టిఫికెట్లు గురించి తెలుసన్నారు. చంద్రబాబుతో సీపీఐ, సీపీఎంను ఎప్పుడో కలిపేసినట్టుగా ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. పట్టాభి అనే టీడీపీ నాయకుడు మాట్లాడిన భాష తప్పుగా అనిపించడం లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ని, సీఎం సతీమణిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఉన్నంత పాపాన ఇళ్లలో ఉన్న మహిళలను బూతులు తిడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications