Rahul Gandhi: రాహుల్ దెబ్బకు దిగొచ్చిన కేంద్రం..! ఎట్టకేలకు అడిగింది ఇచ్చి..!

గత నెల 20న ఢిల్లీలో నీట్ అక్రమాలపై విద్యార్ధులు నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన పెల్లెట్ల ప్రయోగంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ఏకంగా సాహిల్ అనే ఓ బాధితుడిని తీసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చేశారు. ఉన్నట్లుండి ఇవాళ ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు సాహిల్, అతని తల్లితో కలిసి వచ్చిన రాహుల్ గాంధీ.. పోలీసుల్ని బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు.

ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!
ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!

దీంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని కూడా పిలిపించుకుని పోలీసు స్టేషన్ బయట బైఠాయించారు. దీంతో కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్ధితి ఎదురైంది. అయినా సాయంత్రం వరకూ దీనిపై స్పందించకుండా ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తూనే ఉన్న పోలీసులు.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించారు. అనంతరం బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, వెంటనే ఆ కాపీని రాహుల్ గాంధీ చేతికి అందించారు.

Rahul Gandhi s Police Station Protest Leads to FIR in Pellet Gun Case

పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!
పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!

దీంతో రోజంతా పోలీసు స్టేషన్ లోనే ఈ ఎఫ్ఐఆర్ కోసం నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పెల్లెట్ల ప్రయోగమే చేయలేదని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు.. ఇవాళ అందుకు కావాల్సిన ఆధారాలను, బాధితుడి మెడికల్ రిపోర్టులను, చివరికి పెల్లెట్లను కూడా పోలీసులకు అందజేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు. దీంతో పెల్లెట్ల ప్రయోగంలో గాయాల పాలైన ఇతర విద్యార్ధులు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ల నమోదు కోరబోతున్నారు. తనపై జరిగిన పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపు కోల్పోయిన సాహిల్.. తన ఆరోగ్యంపై ఆరా తీసేందుకు నిన్న ఫోన్ చేసిన రాహుల్ గాంధీ.. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పడంతో రేపు పోలీసు స్టేషన్ కు రమ్మని చెప్పి, ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకూ తనతోనే ఉన్నారని బాధితుడు సాహిల్ సంతోషం వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+