లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..! తప్పించే యత్నాలు?

జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ (Lingamaneni Sanjush) హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో తాజాగా చేసిన కారు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ సేల్స్ గర్ల్ మృత్యువాత పడింది. ఈ కేసులో సంజూష్ ను అరెస్టు చేయాల్సిన పోలీసులు.. ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత సంజూష్ ను బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించి, అందులో నెగెటివ్ రావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే అందుకు సంబంధించిన ఫుటేజ్ లో సమయం, తేదీ ఏవీ లేవు.

చంద్రబాబుతో మరో కార్యక్రమానికి పవన్ డుమ్మా..! ఏం జరుగుతోంది ?
చంద్రబాబుతో మరో కార్యక్రమానికి పవన్ డుమ్మా..! ఏం జరుగుతోంది ?

అలాగే సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో సంజూష్ ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ జనసేన ఎంపీ కావడంతో పాటు సీఎం చంద్రబాబు ఇంటికి ఓనర్ కూడా కావడంతో ఆయన కుమారుడిని వదిలేసారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్తూ వస్తున్నారు. కానీ ఇవాళ ప్రమాదం జరిగిన తర్వాత కొందరు ఫోన్లో షూట్ చేసిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ఎలా చేస్తున్నారో అర్దమవుతోంది.

Lingamaneni Sanjush Case New Video Raises Questions Over CCTV Footage and Investigation

గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు షాకింగ్..! ఎలక్ట్రీషియన్లతో దిద్దించారు, వాట్సాప్ లో..!
గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు షాకింగ్..! ఎలక్ట్రీషియన్లతో దిద్దించారు, వాట్సాప్ లో..!

ఎంపీ కుమారుడు సంజూష్ ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న సేల్స్ గర్ల్ ను వేగంగా వచ్చి అస్టల్ మార్టిన్ స్పోర్ట్స్ కారుతో గుద్దేయడంతో ఆమె ఎగిరి పడింది. ప్రమాదం ధాటికి ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో రోడ్డుపై ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలు రోడ్డుపై ఏడుస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోలో ఎంపీ కుమారుడి కారును ప్రమాదం జరిగిన తర్వాత అక్కడే ఉన్న వారు అడ్డుకున్నారు. దీంతో బయటికి దిగిన సంజూష్ ఫోన్ పట్టుకుని అటు ఇటూ తిరుగుతూ కనిపించారు. మరోవైపు రోడ్డుపై ప్రమాదానికి గురై రక్తమోడుతున్న సేల్స్ గర్ల్ తలకు గుడ్డ చుట్టి పక్కనే ఉన్న వారు ఏడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సంజూష్ కారులోనే అక్కడున్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ కేసులో సంజూష్ ను అరెస్టు చేయకుండా కేసు నమోదు చేసి, అందులోనూ ఇంటిపేరు లేకుండా, తండ్రి పేరు లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. దీంతో సంజూష్ ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ విచారణకు రావాల్సిన సంజూష్ రాకపోవడం ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+