జగన్ గెలుస్తాడన్న కేటీఆర్.. కేసీఆర్ కు జరిగిందే జరుగుతుందంటున్న టీడీపీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఏపీలో ఈసారి ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగకు ఏపీ ఓటర్లు బాధ్యతాయుతంగా ఓట్లేసి ఘనంగా ఓట్ల సంబరాన్ని జరుపుకున్నారు. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.. ఇక ఏపీలో ఈసారి ఏ పార్టీ గెలవబోతోంది? ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది? వంటి అనేక ప్రశ్నలు ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి .

ఏపీలో గెలిచేది ఎవరు?
ఈసారి ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఒక వర్గం చెబుతుంటే అంత సీన్ లేదు ఈసారి కూటమిదే అధికారం అంటూ మరో వర్గం చెబుతున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికలలో ఈసారి జరిగిన అల్లర్లు, ఘర్షణలు, దాడుల వెనుక వైసీపీనేతల ఓటమి భయం ఉందని వారు చెబుతున్నారు.

KTR said Jagan will win TDP countered that what happened to KCR will happen to Jagan now

అందరిలో మేకపోతు గాంభీర్యం
ఇదే సమయంలో వైసీపీ ఈసారి మళ్లీ విజయకేతనం ఎగురవేయబోతుందని వైయస్ జగన్ కూడా ధీమాతో ఉన్నారు. అన్ని పార్టీల నేతలు తమ విజయం పైన బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిలో కూడా ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ మేకపోతు గాంభీర్యాన్నీ ప్రదర్శిస్తున్నారు.

జగన్ మంచి ఫలితాలు సాధిస్తారు: కేటీఆర్
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ గెలవబోతోంది అనే దానిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఓటు వేసిన క్రమంలో ఆయన ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు సోదరుడిలాంటి వారని, ఈ ఎన్నికలలో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారని నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్న టీడీపీ
ఏపీలో వైఎస్ జగన్ విజయం సాధించాలన్న ఆకాంక్షను ఆయన తన మాటల ద్వారా వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించేది వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కేటీఆర్ అనేక సందర్భాలలో పేర్కొన్నారు. ఇక తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటే, టిడిపి శ్రేణులు మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు .

తెలంగాణలో బీఆర్ ఎస్ కు జరిగిందే ఏపీలో వైసీపీకి జరుగుతుంది
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తామని కేటీఆర్ చెప్పుకున్నారని, కానీ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారని ఏపీలో కూడా వైసీపీకి అదే జరగబోతుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు బీఆర్ఎస్ ఉంటుందో.. లేక ఈ లోక్ సభ ఎన్నికల్లో సోదిలో లేకుండా పోతుందో చూసుకోమని సెటైర్లు వేస్తున్నారు. తర్వాత ఏపీ రాజకీయాలపై జోస్యం చెప్పొచ్చు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+