వైయస్ విజయమ్మ‌కు తప్పిన‌ ప్రమాదం - ఒక్క సారిగా..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మిత్రుడు అయ్యప్పరెడ్డిని పరామర్శించేందుకు కొందరితో కలిసి కర్నూలు వచ్చారు. పరామర్శ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గుత్త వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్న సమయంలో టైర్లు సడన్ గా పేలాయి. అయితే, విజయమ్మ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో..ఎటువంటి ప్రమాదం లేకుండా విజయమ్మ బయటపడ్డారు.

Recommended Video

    వైయస్ విజయమ్మ‌కు తప్పిన‌ ప్రమాదం - ఒక్క సారిగా *AndhraPradesh | Telugu OneIndia

    కారు టైర్లు పేలటంతో వెనక వస్తున్న విజయమ్మ బంధువులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో స్థానిక నేతలు మరో కారు ఏర్పాటు చేయటంతో..అక్కడ నుంచి విజయమ్మ గుత్తి నుంచి మరో కారులో బయల్దేరి వెళ్లారు. విజయమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కుమార్తె షర్మిల వద్ద ఉంటున్నారు. తన బంధువులకు సంబంధించిన శుభ కార్యాల్లో పాల్గొనేందుకు కడప..అనంతపుం జిల్లాలకు వచ్చారు. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లుగా చెప్పారు.

    Kurnool: CM Jagans Mother Vijayamma escapes narrowly from an accident after the car tyre bursts

    కుమారుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని..కుమార్తె కష్టాల్లో ఉన్న సమయంలో షర్మిలకు మద్దతుగా నిలవటం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అయితే, ప్లీనరీ రెండు రోజులూ విజయమ్మ వేదిక పైనే ఉన్నారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో.. అక్కడ కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని..అండగా నిలిచేందుకు..ఎవరికీ విమర్శలకు అవకాశం లేకుండా తానే వైసీపీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా విజయమ్మ వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+