జగన్ పార్టీ గూటికి కర్నూలు డిసిసి అధ్యక్షుడు రామయ్య
హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు బివై రామయ్య శనివారం వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ జగన్ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు రామయ్యతో పాటు పలువురు నేతలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
జనమంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరానని రామయ్య చెప్పారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు శాసనసభ్యులు టిడిపిలో చేరినా జనం మాత్రం జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.

రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నూలు కార్పోరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతు కారణంగా రామయ్య 2013లో డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, వైసిపిలో చేరడానికి ముందే రామయ్యపై కాంగ్రెసు బహిష్కరణ వేటు వేిసంది. కర్నూలు జిల్లా జిసిసి అధ్యక్షుడిగా లక్కసాగరం లక్ష్మిరెడ్డిని వెంటనే నియమించారు. లక్ష్మిరెడ్డి కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సన్నిహితుడే.












Click it and Unblock the Notifications