ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: కెవిపి
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరందిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అపర భగీరథుడు అనే బిరుదును ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
అమరావతి: 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరందిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అపర భగీరథుడు అనే బిరుదును ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపి కెవిపి రామచంద్రరావు అన్నారు.
2004కు ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడింది చంద్రబాబునాయుడేనని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ఏం చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

తనకు ఆర్థికశాస్త్రంలో ఉన్న ప్రావీణ్యాన్ని ఉపయోగించి రాష్ట్రానికి లాభాలు వచ్చే మార్గాలను చూడాలని కెవిపి రామచంద్రరావు చంద్రబాబుకు సూచించారు.
పోలవరం ప్రాజెక్టును అడ్డుకొంటున్నానని తనపై చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కెవిపి రామచంద్రరావు చెప్పారు. తనపై చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని కెవిపి చంద్రబాబుకు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications