చంద్రబాబు మా మిత్రపక్షమే - జూలు విదిల్చండి : కేవీపీ సంచలనం..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సమర్ధతపైన విశ్వసం వ్యక్తం చేసారు. చంద్రబాబు తమ మిత్రపక్షంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆయన కార్యస్థానం ఢిల్లీకి మార్చాలని సూచించారు. జూలు విదిల్చాలని కోరారు. రాహుల్‌కు అన్యాయం జరిగితే ఏపీ నుంచి అడిగేవారే లేకపోయారని వాపోయారు. ప్రజాస్వామ్యం అంటే అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేసారు. ఢిల్లీకి కార్యస్థానం మార్చి.. ప్రతిపక్షాల ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారు. చిన్న చిన్న విషయాలకు వీధిన పడి కొట్టుకుంటున్న రాష్ట్ర నేతలు.. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు పెట్టి బాధిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధి, ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరూ మాట్లాడరెందుకని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మాట్లాడకపోవటానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్రం నుంచి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

KVP Ramachandra Rao made interesting Comments on Chandra Babu, condemns silence on Rahul disqualification

1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పోరాటం చేసారని కేవీపీ గుర్తు చేసారు. 2002లో మోదీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానని ప్రకటించిన ధీశాలిగా పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆయన కూడా మౌనంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్నిస్తానని చెప్పే జనసేనాని బీజేపీ నేతలను అంర్గతంగా అయినా ప్రశ్నించాలని సూచించారు. 2018లో చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తే రాహుల్‌గాంధీ సంఘీభావం తెలిపారని.. 2019లో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన్ను కించపరచొద్దని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారని కేవీపీ గుర్తు చేశారు. చంద్రబాబు ఒక విధంగా తమకు మిత్రపక్షమేనని కేవీపీ వ్యాఖ్యానించారు. 2019లో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్, మన్మోహన్ వెళ్లి సంఘీభావం ప్రకటించారని గుర్తు చేసారు.

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చంద్రబాబు కలిసి రావాలని కేవీపీ కోరారు. అవసరమైతే చంద్రబాబును కలవటానికి అభ్యంతరం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాత్ కలిసిన విషయాన్ని గుర్తు చేసారు. రాహుల్ అంశంతో పాటుగా పోలవరం విషయంలో అందరూ సహకరించాలని కేవీపీ కోరారు. సరైన కారణానికి సంఘీభావంగా నిలవకుంటే..భవిష్యత్ లో నష్టపోతారాని కేవీపీ హెచ్చరించారు. రేపటి రోజున మనల్ని పట్టించుకొనే వాళ్లు ఉండర్నారు. రాహుల్ కు అండగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. జాతీయ ఉద్యమంగా మారుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేవీపీ చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+