వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగా సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఈనెల 22న రాజ్యసభలో ఓటింగ్ జరగాల్సి ఉంది.

అయితే ఓటింగ్ జరగాల్సిన సమయంలో బీజేపీ సభ్యులు రాజ్యసభలో గందరగోళం సృష్టించి ఓటింగ్ జరగకుండా చేసి తన హక్కులకు భంగం కలిగించారని కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీపీ మంగళవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్‌కు నోటీసు అందజేశారు.

ఈ నోటీసు వల్ల మంగళవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో పాటు పలుమార్లు వాయిదా పడింది. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేసినప్పటికీ, డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్‌ సైతం ఈరోజు బిల్లుకు ఓటింగ్ నిర్వహించడం సాధ్యపడదని తేల్చి చెప్పారు.

 ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

అయితే బీజేపీ ఎంపీలు తన బిల్లుకి అడ్డుపడడ్డారని అరోపిస్తున్న కేవీపీ, 22న కాంగ్రెస్ సభ్యులు కూడా పోటీపడి మరీ సభలో నినాదాలు చేసిన సంగతిని విస్మరించారనే వాదన వినిపిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటీ టీడీపీ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయంటూ రాష్ట్ర ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును సభకు రాకుండా అడ్డుకున్నామని ఢిల్లీలోని పెద్దలు సంతోషపడినప్పటికీ, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా రాదనే సంగతి ప్రజలకు సైతం తెలుసు.

 ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లునే తెలివిగా సభకు రాకుండా అడ్డుకున్న బీజేపీ, కేవీపీ ఇచ్చిన సభా హక్కుల నోటీసుని పక్కకు పెట్టేస్తుందని కాంగ్రెస్‌కు ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఈ సభాహక్కుల నోటీసు ఇచ్చి మంగళవారం రాజ్యసభలో కాసేపు గందరగోళం సృష్టించవచ్చనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా మంగళవారం సభ జరిగిన తీరు చూస్తుంటే తెలుస్తోంది.

 ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?

అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా కోసం మేము పోరాడుతుంటే బీజేపీ మాత్రం దానిని అడ్డుకుంటోదని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్లి ఆలోచనతోనే ఈ సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు సభలో తాము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, బీజేపీ తమ హక్కులని కాలరాసిందని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చు.

English summary
K V P Ramachandra Rao of the Congress today moved a privilege notice in the Rajya Sabha against the BJP leaders for obstructing passage of Andhra Pradesh Reorganisation (Amendment) Bill brought by him on Friday to ensure a special status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X