ఒత్తిడితోనే: కెవిపి రాజీనామా తిరస్కరణ, టిడిపి దూరం?

మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌదరి తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు నిర్ణయానికి నిరసనగా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు రమేష్, సృజనా చౌదరి ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, వేణుగోపాల్ రెడ్డి మాదిరిగానే రమేష్, సుజనా చౌదరి కూడా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారే తప్ప తమ రాజీనామా లేఖలను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి అందజేయలేదట.
రాష్ట్ర విభజనకు నిరసనగా రాజ్యసభ సభ్యత్వానికి తెలుగుదేశం సభ్యుడు హరికృష్ణ చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించిన విషయం తెలిసిందే. తాము కూడా తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు సీమాంధ్రకు చెందిన సిఎం రమేష్, సుజనా చౌదరిలు ప్రకటించారు. అయితే వారి రాజీనామాలకు సంబంధించిన వివరాలు తమ రికార్డుల్లో లేవని, ఫార్మాట్లో ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆ వివరాలు పొందుపరుస్తామని రాజ్యసభ కార్యాలయం చెబుతోందట.












Click it and Unblock the Notifications