దారుణం: మహిళా అధ్యాపకురాలి దారుణ హత్య

గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన ఉద్యోగం మానేసిదంి. జనవరి 1వ తేదీ ఉదయం ఆరున్నరకు హిమబిందుకు ఫోన్ వచ్చింది. తన సహోద్యోగి జన్మదినం విందుకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. ఇక తిరిగి రాలేదు.
ఆ రోజు రాత్రయినా రాకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఫోన్ చేసింది కడప జిల్లా తంబాలపల్లె వాసి బలరాంరెడ్డిగా గుర్తించారు. వారు అతన్ని పోలీసులకు అప్పగించారు. జనవరి 2వ తేదీన హిమబిందు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదిలావుంటే, జనవరి 7వ తేదీన శిరువెళ్ల మండల పరిధిలోని అడవిలో కాలువ ఒడ్డున ఓ యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలి ఉండడంతో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నంద్యాలలో శవపరీక్ష చేయించి ఖననం చేయించారు.
బలరాంను పోలీసులు విచారించగా హిమబిందు హత్యోదంతం వివరాలు బయటపడ్డాయి. బలరాం హిమబిందుకు ఫోన్ చేసి తన జన్మదినమంటూ శిరువెళ్ల పరిధిలోని నల్లమల ప్రాంతానికి తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కోపంలో అతడు ఆమెను కాలువలో ముంచేసి చంపేసినట్లు తెలుస్తోంది. బలరాంతో పాటు వెంకటేష్ గౌడ్, మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications