రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరికతీర్చంటూ, వివాహితపై బాబాయి లైంగిక వేధింపులు, చివరికిలా...

బకాయి డబ్బుల కోసం కూతురు వరుసయ్యే వివాహితను లైంగికంగా వేధించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రిలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:బకాయి డబ్బుల కోసం బాబాయి వరుసైన వ్యక్తి లైంగికంగా వేధించడంతో మనోవేధనకు గురైన ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన రాజమండ్రిలో చోటుచేసుకొంది.

రాజమండ్రి గ్రామీణ మండలంలోని బొమ్మూరు నేతాజీనగర్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.నేతాజీనగర్ లోని 5వ, వీధిలో శరత్ కుమార్ , అతని భార్య ఆమని నివసిస్తున్నారు. వీరికి ఆరేళ్ళ క్రితమే వివాహమైంది.పిల్లలు లేరు.

ఆమనికి బాబాయి వరుసయ్యే డి. వెంకటేశ్వర్లు వద్ద శరత్ కుమార్ కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొన్నాడు. శరత్ కుమార్, ఆమని వివాహ విషయంలో కూడ వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించాడు.

అయితే తన డబ్బులు ఇవ్వని పక్షంలో తన కోరిక తీర్చాలంటూ వెంకటేశ్వర్లు ఆమనిని వేధించేవాడని శరత్ కుమార్ చెబుతున్నారు.డబ్బులు ఇవ్వకుండా, తన కోరిక తీర్చకుండా చేస్తే నీ భర్తను చంపేస్తానంటూ ఆమనిని వెంకటేశ్వర్లు బెదిరించేవాడు.

 lady suicide for sexual harassement

అయితే రెండు రోజుల క్రితమే వెంకటేశ్వర్లు బెదిరిస్తున్న విషయాన్ని ఆమని తన భర్త శరత్ కుమార్ కు చెప్పింది.దీంతో ఈ రెండు కుటుంబాలకు మధ్య గొడవలు జరిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి.

అయినా వెంకటేశ్వర్లు ఆమనిని వేధించడం మానుకోలేదు. పోన్ చేసి ఆమనిని బెదిరించేవాడు.ఆమని, ఆమె భర్త శరత్ కుమార్ యధావిధిగా తాము పనిచేసే భవన నిర్మాణ రంగ కంపెనీకి వెళ్ళారు.

శరత్ కుమార్ కంపెనీ పని మీద యజమానితో కలిసి మధురూడికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చాడు.అయితే అప్పటికే ఆయన భార్య ఆమని పడక గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

వరుసకు బాబాయి అయిన వెంకటేశ్వర్లు లైంగికంగా తనను వేధిస్తున్న విషయాన్ని ఆమె లేఖ రాసింది. ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆమె లేఖ రాసింది.

English summary
lady suicide for sexual harassement in Rajahmundry.venkateshwarlu sexually harassed amani for two years.amani husband complient against venkateshwarlu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X