మహిళా టీచర్ బరితెగింపు: రెండు పెళ్లిళ్లు చేసుకుంది

విశాఖపట్నం: రెండో పెళ్లికి సిద్ధపడిన ఓ మహిళా టీచర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు పెళ్లి కాలేదంటూ 26 ఏళ్ల మహిళా టీచర్ రెండో పెళ్లి చేసుకుంది. విశాఖపట్నం సిరిపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన రమాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనీలో తన వివరాలు నమోదు చేసుకుంది. ఆ వివరాలు నచ్చడంతో విశాఖపట్నంలోని సిరిపురానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ (29) ఆమెతో పెళ్లికి సిద్ధపడ్డాడు.

 Lady teacher arrested for cheating at Visakha

దాంతో 2012లో రమాదేవి, శ్రీనివాస్‌ల వివాహం జరిగింది. ఆమెకు గతంలోనే 2003లో మరో వ్యక్తితో పెళ్లయిందని, అతనితో పడకపోవడంతో విడిపోయిందని తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భర్తతో విడాకులు పొందిన తర్వాతనే రెండో పెళ్లికి అనుమతి లభిస్తుంది.

అయితే, రమాదేవి విడాకుల ప్రస్తావన తేలేదు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రమాదేవితో పాటు ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తనకు చట్టం గురించి తెలియదని రమాదేవి అంటోంది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమెకు చట్టం గురించి తెలియదంటే నమ్మడం కష్టమనే మాట వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+