సాఫ్ట్‌వేర్ కంపెనీలో కలిశారు: ప్రియుడి ఇంటి ముందు లేడీ టెక్కీ ధర్నా

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులు కూడా న్యా యం చేయడం లేదని ఆమె విమర్శించింది. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడింది.

చిత్తూరు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులు కూడా న్యా యం చేయడం లేదని ఆమె విమర్శించింది. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడింది.

చిత్తూరు దుర్గానగర్‌ కాలనీకి చెందిన దొడ్డా స్వరూప, స్థానిక గిరింపేటకు చెందిన వయ్యాసి నవీన్‌ కుమార్‌ ప్రేమలో పడ్డారు. బెంగళూరులోని ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తూ కొంతకాలం కలసి కూడా ఉన్నారు. అయితే, రెండేళ్ల క్రితం చిత్తూరుకు చెందిన న్యాయవాది కుమార్తెతో నవీన్‌ నిశ్చితార్థం జరిగిందనే సమాచారం స్వరూపకు తెలిసింది. దీంతో స్వరూప అసలు విషయం చెప్పడంతో ఆయన పెళ్లి రద్దు చేశారు.

Lady techie stages dharna at Chittoor in front of lover's house

అయినా అతను మారకపోవడంతో చిత్తూరు టూటౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నవీన్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఇదిలావుంటే, ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం చేస్తున్న నవీన్‌ అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్వరూపకు సమాచారం అందింది.

దీంతో శుక్రవారం ఉదయం ఆమె ప్రియుడు ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రేమ పేరిట తనను మోసం చేసిన వ్యక్తి విదేశాలకు వెళ్తున్నాడనీ, పోలీసులు కూడా న్యాయం చేయడం లేదని ఆమె మీడియాతో చెప్పింది. తనకు నవీన్‌కుమార్‌తో పెళ్లి చేయాలని డిమాండ్‌ చేసింది. ఆమెకు వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, సీపీఐ నేత నాగరాజన్‌ తదితరులు మద్దతు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+