ఒంటరి స్త్రీలే టార్గెట్: పోలీసులకు చిక్కిన లేడీ కిలాడీ

ఆ ఘరానా పాత నేరస్థురాల్ని ఉత్తర మండలం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్‌లోని శంకర్‌నగర్‌కు చెందిన బోయ దుర్గ సహచరులైన మేకల దుర్గ, మెర్సి రాణి, ఆమూరి తిరుపతమ్మతో కలిసి దొంగతనాలు చేస్తోంది.
మహిళల చేతిబ్యాగ్‌లు, పర్సుల నుంచి బంగారు ఆభరణాలు అపహరించి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చుకునేది. గతంలో ఆమెను మీర్‌చౌక్, మేడిపల్లి, ఎల్‌బీనగర్, బేగంపేట, హుమాయున్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు ఆమెను పట్టుకునే సందర్భాల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేసేది. నిందితురాలిపై ప్రస్తుతం బొల్లారం, తిరుమలగిరి, మహంకాళి పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు, బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications