విద్యార్థులతో లగడపాటి: చిన్నారులతో జగన్(పిక్చర్స్)
గుంటూరు/చిత్తూరు: రాష్ట్ర విభజన జరిగితే వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలోని 25 పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం గుంటూరు జిల్లాలోని పెదపలకలూరులోని విజ్ఞాన్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యాసంస్థల జెఎసి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 5 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానున్నాయని అన్నారు. విభజనపై ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల నాటికి జై సమైక్యాంధ్ర అనక తప్పని పరిస్థితులు నెలకొంటాయని స్పష్టం చేశారు.
పేద బతుకులను మారుస్తా: జగన్
చిత్తూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద బతుకులను మారుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలంలో ఆయన సమైక్య శంఖారావం, ఓదార్పును నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన ఎస్ఎస్‌పురం దళితవాడకు చెందిన బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదార్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బాలపల్లి పెద్దబ్బ మనవడు మాతయ్య (5), అదే గ్రామానికి చెందిన సుభాషిణి కుమార్తె పూజ (4నెలల)ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి తమ పార్టీ తరపున వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకంతో వృద్ధులకు 700 పింఛను, రెండవ సంతకంతో అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే చిన్నారులకు నెలకు రూ. వెయ్యి అందుతుందని తెలిపారు.

హాజరైన విద్యార్థులు
గుంటూరు జిల్లాలోని పెదపలకలూరులోని విజ్ఞాన్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యాసంస్థల జెఎసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు.

లగడపాటి ప్రసంగం
గుంటూరు జిల్లాలోని పెదపలకలూరులోని విజ్ఞాన్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యాసంస్థల జెఎసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

విద్యార్థి నాయకులతో లగడపాటి
గుంటూరు జిల్లాలోని పెదపలకలూరులోని విజ్ఞాన్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యాసంస్థల జెఎసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులతో చేయి కలిపి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న లగడపాటి.

లగడపాటి
గుంటూరు జిల్లాలోని పెదపలకలూరులోని విజ్ఞాన్ కళాశాల ఆవరణలో జరిగిన విద్యాసంస్థల జెఎసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినితో ముచ్చటిస్తున్న లగడపాటి రాజగోపాల్.

జగన్ ఓదార్పు
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలంలో ఆయన సమైక్య శంఖారావం, ఓదార్పును నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన ఎస్ఎస్‌పురం దళితవాడకు చెందిన బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదార్చారు.

చిన్నారితో జగన్
చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి.. ఎస్ఎస్‌పురం దళితవాడకు చెందిన బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న అదే గ్రామానికి చెందిన సుభాషిణి కుమార్తె పూజ (4నెలల)ను వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారిని ఎత్తుకున్న దృశ్యం.

జగన్ పరామర్శ
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలంలో ఆయన సమైక్య శంఖారావం, ఓదార్పును నిర్వహించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన ఎస్ఎస్‌పురం దళితవాడకు చెందిన బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలపల్లి పెద్దబ్బ మనవడు మాతయ్య (5)ను వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.












Click it and Unblock the Notifications