జగన్ బెయిల్ కోసం లగడపాటి ప్రయత్నాలు: దేవినేని

Devineni Umamaheswara Rao
విజయవాడ/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం ఆరోపించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

జగన్ లక్ష కోట్లు దోపిడీ చేస్తే రూ.35 వేల కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ కూడా నిర్ధారిస్తే ఈడి ఎందుకు ముందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. సిబిఐ జెడ లక్ష్మీనారాయణ, డిఐజి వెంకటేశ్‌లకు స్థానచలనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంకా చాలా చార్జిషీట్లు వేయాల్సి ఉండగా ఉన్నతాధికారులను మార్చడమేమిటన్నారు. జగన్‌కు బెయిల్ ఇప్పించడం ద్వారా ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు గుంభనగా వ్యవహారాలు జరిగిపోతున్నాయని ఆరోపించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది ఉద్యోగులతో ఆటలాడుకుంటోందన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? కేంద్ర మంత్రులకు సిగ్గు రావడం లేదా అని మండిపడ్డారు.

దివాకర్ ట్రావెల్స్‌కు సమైక్య సెగ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆగి ఉన్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి చెందిన బస్సును గురువారం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ప్రయాణికులతో అనంతపురం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న బస్సు అద్దాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్రకు సంఘీభావం తెలుపుతుంటే రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు మాత్రం సొంత బస్సులను రోడ్లెక్కించడం ఏమిటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+