లగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు ప్లాన్ ఇదే

లగడపాటి రాజగోపాల్ సర్వే పట్ల టిడిపి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో లగడపాటి సర్వే ప్రకారంగానే ప్రజల నుండి పీడ్ బ్యాక్ఈ సర్వే సూచనలు అమలు చేయాలని కోరుతున్న తెలుగుతమ్

Recommended Video

    Lagadapati Rajagopal latest survey facts on TDPలగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు | Oneindia Telugu

    అమరావతి:విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజా సర్వే సమాచారాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకు అందించారు. ఈ సర్వే సమాచారానికి అనుగుణంగానే ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో తెలుగుతమ్ముళ్ళకు ఫీడ్ బ్యాక్ అందుతోంది. దీంతో లగడపాటి సర్వేలపై తెలుగు తమ్ముళ్ళకు మరింత గురి ఏర్పడింది. ఈ సర్వేకు అనుగుణంగా వ్యూహన్ని రచించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ సర్వేలో ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ప్రకారంగా వ్యవహరించాలని కొందరు నేతలు చంద్రబాబునాయుడును కోరుతున్నారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే దాదాపుగా నిజమైంది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో లగడపాటి నిర్వహించిన సర్వేకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి.

    దీంతో లగడపాటి నిర్వహించిన సర్వేలపై మరింత విశ్వసనీయత పెరిగింది.అయితే ఇటీవల కాలంలో లగడపాటి రాజగోపాల్ రెండు దఫాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. రాజకీయాల్లోకి లగడపాటి వస్తారనే ప్రచారం కూడ సాగింది.

    ఇటీవల కాలంలో చంద్రబాబునాయుడును లగడపాటి కలిసిన సమయంలో తాజాగా నిర్వహించిన సర్వే విషయాలను లగడపాటి రాజగోపాల్ చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు. ఈ సర్వేలో లగడపాటి సూచించినట్టుగానే ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో సమాచారం వస్తోంది.

    .లగడపాటి సర్వేలో సమాచారం ఏమిటి

    .లగడపాటి సర్వేలో సమాచారం ఏమిటి

    తెలుగుదేశం పార్టీకి అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండే పట్టణప్రాంతాల్లో ఆదరణ బాగుందని సర్వేలో తేలింది. పల్లెసీమల్లో మాత్రం 2014 ఎన్నికల్లో ఉన్న గ్రూపులు అలాగే ఉన్నాయనీ, అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలనీ సీఎం చంద్రబాబుకు లగడపాటి సూచించారు.నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో అంశాలు ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజా సర్వేలో కూడ ఇదే రకమైన సమాచారం వచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాలకు అందింది.

    లగడపాటి సర్వే సూచనలను పాటిస్తే ప్రయోజనమేనా?

    లగడపాటి సర్వే సూచనలను పాటిస్తే ప్రయోజనమేనా?

    లగడపాటి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో పార్టీ శ్రేణులు సైతం ఏకీభావం ప్రకటిస్తున్నాయి. గ్రామీణప్రాంతాల్లో ఉన్న పరిస్ధితిని లగడపాటి కళ్లకు కట్టినట్టు వివరించారనీ, ఆయన చేసిన సూచనలను అమలు జరపాల్సిందేననీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సూచనలను అమలు చేస్తే పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.

    రేషన్ కార్డులు, పెన్షన్‌లకు డిమాండ్

    రేషన్ కార్డులు, పెన్షన్‌లకు డిమాండ్

    గ్రామీణ ప్రజల్లో ప్రధానంగా రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ఎక్కువ డిమాండ్ ఉందనీ, వాటిపై దృష్టి సారించడంతోపాటు గృహనిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు సూచించారు.. ఈ మేరకు చంద్రబాబు కూడా లగడపాటి వాదనతో ఏకీభవించినట్టు తెలిసింది. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో కూడ ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ వస్తోందని తెలుగుతమ్ముళ్ళు అభిప్రాయపడ్డారు.

    తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలి

    తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలి

    గ్రామీణ ప్రాంతాల్లో తటస్ధంగా ఉండే ఓటర్లతోపాటు ప్రత్యర్ధివర్గంలో ఊగిసలాటలో ఉండే వారిని కూడా అక్కున చేర్చుకోవాలని లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేకు అనుగుణంగా వ్యవహరించాలని టిడిపి నాయకత్వం టిడిపి నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేకు అనుగుణంగానే ప్రజలు కూడ అభిప్రాయపడుతున్న విషయాన్ని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు. ఈ సర్వేను అమలు చేసేందుకు టిడిపి నాయకత్వం ఏం చేస్తోందనే ఆసక్తి నెలకొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+