Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లగడపాటిది లత్కోర్ సర్వే.. బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకున్న బోగస్ సర్వే.. వైసీపీ ఫైర్

Recommended Video

    Exit Polls 2019 : లగడపాటిది లత్కోర్ సర్వే... బుకీలతో డీల్ కుదుర్చుకున్నాడు-వైసీపీ || Oneindia Telugu

    ఏపీలో ఎన్నికల ఫలితాలు రాక ముందే ఎగ్జిట్ పోల్స్ హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ సర్వేలన్నీ దాదాపు వైసీపీ విజయం సాధిస్తుంది అని చెప్తే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీడీపీ విజయం సాధిస్తుంది అని చెప్పారు. ఇక లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వేపై వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శైలజాచరణ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు .

    లగడపాటి సర్వేపై మండిపడుతున్న వైసీపీ నేతలు .. లత్కోర్ సర్వే అని మండిపడిన వైసీపీ మహిళా నేత

    లగడపాటి సర్వేపై మండిపడుతున్న వైసీపీ నేతలు .. లత్కోర్ సర్వే అని మండిపడిన వైసీపీ మహిళా నేత

    లగడపాటి సర్వేను లత్కోర్ సర్వేగా ఆమె పేర్కొన్నారు. నిన్నటికి నిన్న విజయ సాయిరెడ్డి లగడపాటి సర్వేపై స్పందించి లగడపాటి ఎల్లో జలగ అని, నారా రాజగోపాల్ అని పేరు పెట్టుకోమని విమర్శించారు. టీడీపీ కోసం డ్రామాలు ఆడుతున్నాడని, చంద్రబాబు ఏం చెప్పమంటే అదే చెప్తాడని మండిపడ్డారు. ఇక తాజాగా శైలజాచరణ్ రెడ్డి లగడపాటి సర్వేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. ఆంధ్ర బెట్టింగ్ బుకీలతో డీల్ కుదుర్చుకొని బోగస్ సర్వేను లగడపాటి విడుదల చేశారన్నారు. లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. లగడపాటి సర్వేలకు కాలం చెల్లిందన్నారు. తెలంగాణలో సర్వే చేసినప్పుడే లగడపాపాటి పరువు పోయిందని ఆమె అభిప్రాయం వ్యక్త చేశారు.

    లగడపాటి సర్వే బెట్టింగ్ బుకీలతో కుమ్మక్కై ఇచ్చిన బోగస్ సర్వే అన్న వైసీపీ

    లగడపాటి సర్వే బెట్టింగ్ బుకీలతో కుమ్మక్కై ఇచ్చిన బోగస్ సర్వే అన్న వైసీపీ

    లగడపాటి సర్వేలు బెట్టింగుల కోసమేనని అందరికీ తెలుసునని ఆమె విమర్శించారు.తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా లగడపాటి డ్రామాలు ఆడాడని తెలంగాణలో మహాకూటమి గెలుస్తోందని చెప్పాడని కానీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం అదే తప్పిదాన్ని మళ్ళీ ఏపీలో కూడా పునరావృతం చేస్తున్నారని ఆమె అన్నారు . బోగస్ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్‌ సీఎం కావడం తథ్యమని దాన్ని ఎవరూ మార్చలేరని ఆమె అన్నారు. ఇక మరోవైపు ఎన్నికల ఫలితాలపై లగడపాటి జ్యోతిష్యం చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ విమర్శించారు. బెట్టింగ్ రాయుళ్లను తప్పుదోవ పట్టించేందుకు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారని ఆయన ఆరోపించారు.

    క్రెడిబులిటీ లేని సర్వేలు ఇస్తున్నాడని లగడపాటిపై వైసీపీ ధ్వజం

    క్రెడిబులిటీ లేని సర్వేలు ఇస్తున్నాడని లగడపాటిపై వైసీపీ ధ్వజం

    మొత్తానికి జాతీయ సర్వేలు ఇచ్చిన జోష్ లో ఉన్న వైసీపీ నేతలు లగడపాటి సర్వేపై మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు తొత్తుగా చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెప్తున్నాడని, ఇలాంటి ఫలితాలు వెల్లడించి లగడపాటి బెట్టింగ్ లలో డబ్బు సంపాదిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అసలు లగడపాటి సర్వేకు ప్రాధాన్యత లేదని వారంటున్నారు. క్రెడిబులిటీ లేని ఎగ్జిట్ పోల్ ఫలితాలను పట్టించుకోవద్దని వైసీపీ నేతలు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+