విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శారదాపీఠంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:విశాఖ శారదా పీఠంలో లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో శుక్రవారం ప్రారంభమైన ఈ పవిత్ర యాగాలకు శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

ప్రతీ ఏటా భక్తిశ్రద్దలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ యాగాలు ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. తొలుత గోపూజతో ప్రారంభమై, గణపతిపూజ, దీక్షాదారణ, ఋత్విగరన, అగ్నిమధనం నిర్వ హించారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి సౌజన్యంతో పది సంవత్సరాలుగా శారదాపీఠంలో ఈ యాగాలు నిర్వహిస్తున్నారు.

 శారదా పీఠంలో...పవిత్ర యాగాలు

శారదా పీఠంలో...పవిత్ర యాగాలు

విశాఖ శారదా పీఠంలో లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం నిర్వహణ కోసం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 300 మంది రుత్విక్‌లు ఈ యాగంలో భాగస్వాములయ్యారు. తొలుత గోపూజతో ప్రారంభించి ఆ తరువాత గణపతిపూజ, దీక్షాధారణ, ఋత్విగరన, అగ్నిమధనం తో యాగ క్రమాన్ని కొనసాగించారు.

లోకకళ్యాణం కోసమే...ఈ యాగాలు

లోకకళ్యాణం కోసమే...ఈ యాగాలు

ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ దేశంలో ప్రజలందరూ సుఖసంతోషాలుతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలతో రైతన్నలు సంతోషంగా ఉండాలని తలంపుతో లోకకళ్యాణం కోసం ఈ యాగాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

భాగస్వామిని కావడం...అదృష్టం

భాగస్వామిని కావడం...అదృష్టం

ఇందుకోసం రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి ప్రతీ ఏటా సంపూర్ణ సహకారం అందించడం జరుగుతోందని తెలిపారు. తదుపరి డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం ప్రతీ ఏటా స్వరూపానందేంద్ర స్వామి వారు ఈ యాగాలు నిర్వహించడం, ఈ పవిత్ర కార్యాల్లో తమను కూడా భాగస్వా ములను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వందలాది మంది రుత్విక్‌లు నియమ నిష్టలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

ఈనెల 6న...ముగింపు

ఈనెల 6న...ముగింపు

భవిష్యత్తులో కూడా ఈ యాగాలను నిర్వహిస్తామని , తన తదుపరి తన వంశీయులు కూడా కొనసాగిస్తారని టిఎస్‌ఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్‌, బెహరా భాస్కరరావు, పేడాడ రమణికుమారి, పీఠం ట్రస్టీ నివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర పీఠాధిపతి కిరణ్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాగాలు ఈనెల 6న జరిగే పూర్ణాహుతితో ముగియనున్నాయి. యాగాలకు సంబంధించిన ఏర్పాట్లను పీఠం శ్రీకార్యం కామేశ్వరశర్మ పర్యవేక్షించారు.

English summary
Lakhsha Chandiyagam, Athirudra Yagam in Visakha Saradha Peetham, continues to be the most spectacular. In which as many as 300 rithwiks are participating in these Yaga's from Andhra Pradesh and also the neighbouring States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X