లక్ష్మీపార్వతి, పూనం కౌర్ పై అసభ్య ప్రచారం చేసిన కోటి దొరికాడు.. కానీ .. పోలీసులు పట్టుకోలే!
తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన లక్ష్మీపార్వతివేధింపుల కేసులో లక్ష్మీ పారవతినే కాకుండా నటి పూనం కౌర్ ను కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా లో దుమారం రేపిన కోటి కోర్టులో లొంగిపోయాడు .ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత లక్ష్మీపార్వతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, సినీ నటి పూనం కౌర్ వ్యక్తిగత సంభాషణలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటి పై గతంలో లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . ఇక కేసులో నిందితుడైన కోటి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మంగళవారం లొంగిపోయాడు.

లక్ష్మీపార్వతిని వేధించిన కేసులో నిందితుడు కోటి .. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు
జూనియర్ ఆర్టిస్ట్ అయిన కోటిని తాను కొడుకులా చూసుకుంటే అతను సోషల్‌మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేశాడని లక్ష్మిపార్వతి ఏప్రిల్ 15న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు కోటి చేసిన ఆరోపణలను భరించలేక ఆమె తన సహనాన్ని పరీక్షిస్తున్నారని తన పై కోటి అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీని కలిశారు . తనపై లైంగిక ఆరోపణలు చేసిన కోటి అనే యువకుడిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కోటి చేసిన ఆరోపణలను కొన్ని టీవీ చానెళ్లతోపాటు సోషల్ మీడియాలో ఎలాంటి వివరణ లేకుండా ప్రసారం చేసి తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను మహిళా అనే విచక్షణ కూడా మరిచి అదే పనిగా తనపై ఆరోపణలు చేస్తుండటంతో మానసిక చిత్రవధ అనుభవిస్తున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బిడ్డలా భావిస్తే అసభ్యప్రచారం చేశాడని వాపోయిన లక్ష్మీ పార్వతి .. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన కోటి వ్యవహారం
తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణల తర్వాత ఎంక్వైరీ చేస్తే నేరచరిత్ర ఉన్నట్టు తెలిసిందన్నారు.నేర చరిత్ర ఉన్న కోటి లాంటి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆరోపణల వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తనకు న్యాయం చెయ్యాలని కోరారు. ఇంటికి రానిచ్చి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని బిడ్డలా చూశానని లక్ష్మిపార్వతి చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆదరించారని అన్నారు. తన తరఫున ఫోన్ ద్వారా మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు పంపించాలని కోటికి చెప్తే దాన్ని అవకాశంగా తీసుకున్నాడని, తప్పుడు మెసేజ్‌లు పంపి బురదజల్లే ప్రయత్నం చేశాడని ఆమె అప్పట్లోనే ఆవేదన చెందిన విషయం తెలిసిందే .

పూనం కౌర్ కు కోటి వేధింపులు .. పట్టుకోలేకపోయిన పోలీసులు .. కోర్టులో కోటి లొంగుబాటు .. బెయిల్ మంజూరు
ఇక నటి పూనంకౌర్ వ్యక్తిగత సంభాషణలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హల్‌చల్ చేసింది కూడా కోటియేనని సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. తన ఫోన్ నుంచి వ్యక్తిగత డేటా, కాల్ రికార్డింగ్‌లు సేకరించి వాటిని సోషల్‌మీడియా ద్వారా వైరల్ చేశారని పూనం కౌర్ గతంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలులో కేఏపాల్ సోదరుడు డేవిడ్‌రాజ్ హత్య కేసులోనూ కోటి నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.ఈ రెండు కేసుల్లోనూ అతడే నిందితుడని నిర్ధారించిన సీసీఎస్ పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ పోలీసులు కోటిని ఇంత కాలం పాటు పట్టుకోలేకపోయారు. ఇక ఇప్పుడు కూడా కోటి స్వయం గా కోర్టులో న్యాయమూర్తి ముందు లొంగిపోయాడు . అయితే నాటకీయ పరిణామాల మధ్య కోటి కోర్టు ఎదుట లొంగిపోయా డు. నాంపల్లి కోర్టులో దర్శనమివ్వడంతో పట్టుకొనేందుకు వచ్చిన హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు పట్టుబడకుండా కోటి న్యాయమూర్తి ముం దుకు రావడంతో కోర్టు కోటికి బెయిల్ మంజూరు చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications