అమరావతిలో ఆ రైతులకు బాబు షాక్: భూసేకరణకు నోటిఫికేషన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో రాజధాని నిర్మాణం పేరిట భూసేకరణకు మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అమరావతి పరిధిలోని నేలపాడులో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వగా 45 మంది రైతులు అందుకు ససేమిరా అన్నారు.

Land acquisition notification in Amaravati

ఇప్పటికే సేకరించిన భూముల మధ్యలో చిన్న చిన్న బిట్లుగా ఉన్న 27 ఎకరాల భూమి సేకరణకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్ పూలింగ్ పధ్ధతిలో భూమిని సేకరించనున్న ప్రభుత్వం భూయజమానులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తుంది.

నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో సదరు భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలుంటే రెండు నెలల్లో తెలపాలని భూమి యజమానులకు ప్రభుత్వం సూచించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Land acquisition notification in Andhra Pradesh capital Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి