గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఆఫర్, డిమాండ్: నో చెప్పినవారు లేరా?(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే భూమిలో రైతుకు 50-50 నిష్పత్తి విధానం అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వెల్లడించారు. భూసేకరణ సందర్భంగా అక్కడి వారిని అన్నివిధాలా
ఆదుకుంటామన్నారు. రాజధాని కోసం భూమిని సేకరించేందుకు 29 గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. భూసేకరణకు కొందరి నుండి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. వారితో మాట్లాడారు.

మంగళవారం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ముఖాముఖి నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగే తూళ్లూరు ప్రాంతం అక్కడి
రైతులను శ్రీమంతులుగా మార్చుతుందన్నారు. ఆ ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాలను కాలరాసే విధంగా జరుగుతున్న చెప్పుడు మాటల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. భూములు ఇచ్చిన కుటుంబాల్లో వారికి ఉపాధి, ఇతరత్రా ప్రయోజనాలు కూడా అందిస్తామని హామీనిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

అభిప్రాయ సేకరణ జరపడానికి గుంటూరు జిల్లాకు వెళ్లిన మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులకు కొన్ని గ్రామాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం తెలిసిందే.

చంద్రబాబు

చంద్రబాబు

రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాజధాని ప్రాంతంలో జరిగే అభివృద్ధిని చంద్రబాబు రైతులకు వివరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేవారి కుటుంబాల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. భూయజమానులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

సిల్క్ డెవలప్‌మెంట్ ద్వారా పరిశ్రమల్లో అవకాశం వచ్చేలా చూస్తామని ఆయన చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చే రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలను ముందుకు రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. భూ సేకరణకు ముందుకు వచ్చే రైతులు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అన్నారు. కాగా, ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 చంద్రబాబు

చంద్రబాబు

45 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఎర్పటాు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


బివోటీ (బిల్డ్ - ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు కెంపనీలు ముందుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. దొనకొండలో ఎపి రాజధానిని నిర్మించాలనే ప్రతిపాదన మొదట్లో వచ్చింది.

చంద్రబాబు

చంద్రబాబు

సిఎం వ్యాఖ్యలతో భయాందోళనలు రాజధాని నిర్మాణానికి భూముల సేకరణ విషయంలో ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత లేదని టిడిపి ప్రభుత్వం తప్పు దారి పట్టిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. తమ జీవితాలు ఏమై పోవాలని నిలదీస్తున్నట్లు ఆయన తెలిపారు.

రైతులు కూడా చంద్రబాబు ముందు భారీ డిమాండ్లు పెట్టారు. తాము ఇచ్చిన ప్రతి ఎకరానికి వెయ్యి గజాల నివాస స్థలం ఇవ్వడంతోపాటు, 200 గజాల వాణిజ్య స్థలాన్ని కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు
కూడా ఉపాథి అవకాశాలు కల్పించాలని, వారికి ప్రత్యేక ఆరోగ్యబీమా సౌకర్యం అందించాలని కోరారు. రైతులకు ఇచ్చిన
భూమిని ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుము లేకుండా చూడాలని కోరారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబును కలిసిన వారిలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని రైతులు లేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 29 గ్రామాల్లో.. 11 గ్రామాల్లో పలువురు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అలా భూములు ఇచ్చేందుకు నిరాకరించిన వారిని ఆహ్వానించలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

English summary
The proposed meeting between AP Chief Minister N. Chandrababu Naidu and the farmers of 29 villages of the capital on Tuesday will not be attended by those opposed to the government’s land pooling proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X