అమరావతి వారికే సొంతమా - కీలక పరిణామం..!!
ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత అమరావతిలో కదలిక వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం మారటంతోనే రాజధాని అమరావతి గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో పడిపోయిన ధరలు ఇప్పుడు రెట్టింపు అవుతున్నాయి. రియాల్టర్లు అమరావతి పైనే ఫోకస్ చేస్తున్నారు. గత రెండు నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.
ప్రభుత్వం మార్పుతో
కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత 70 నుంచి 80 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. గత నెల జూన్ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు మరింత పెరిగాయి. మెట్ట ప్రాంతంలో గతేడాది భూమి ధర గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు ఉండగా, ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది. జరీబు (మాగాణి) గ్రామాల్లో గతేడాది గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. గత వారం రోజుల్లో గజం రూ.52 వేల నుంచి రూ.56 వేల మధ్య రిజిస్ట్రేషన్లు జరిగాయి. తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరగా, ఈ నెలలో గడిచిన పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

పెరిగిన క్రయ విక్రయాలు
ఏప్రిల్‌లో 190, మేలో 221 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో 2015లో అప్పటి టిడిపి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాల భూమిని సమీకరించింది. 2019లో రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చింది. 2019 డిసెంబరు 17న అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, అమరావతిలో సంక్షోభం ఏర్పడింది. భూముల క్రయవిక్రయాలు మందగించాయి. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు.
రెట్టింపైన ధరలు
దీంతో.. ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు డొమెస్టిక్ ల్యాండ్, 200 గజాలు కమర్షియల్ ల్యాండ్, ఎకరా జరీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు డొమెస్టిక్ ల్యాండ్, 250 గజాలు కమర్షియల్ ల్యాండ్ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులకు స్థలాల కొనుగోలు భారంగా మారుతోంది.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!












Click it and Unblock the Notifications