పెన్షన్ల పెంపు: పెంచింది లోలెవల్.. ప్రచారం పీక్ లెవల్లో; అవసరమా జగన్: లంకా దినకర్
బీజేపీ నేత లంకా దినకర్ ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పెంపును నేటి నుండి అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చిటికెడు పెన్షన్ కి బారెడు ప్రకటనలు అవసరమా అంటూ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు బిజెపి నేత లంకా దినకర్. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు తాజాగా ఏపీ సర్కార్ పెన్షన్ పెంపును టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వటం కన్న పీకటానికే ఎక్కువ కసరత్తు
రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికన్నా, పెన్షన్లు పీకడానికే కసరత్తు ఎక్కువ చేశారంటూ లంకా దినకర్ ఎద్దేవాచేశారు. చిటికెడు పెన్షన్ ను పెంచి బారెడు ప్రకటనలు చేయటం అవసరమా జగన్ గారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ టి ఎస్ వసూళ్లు, మద్యం వసూళ్లు, మైనింగ్ వసూళ్లతో పాటు చెత్త మీద వసూళ్ళు కూడా పెరిగిపోయాయని లంకా దినకర్ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పెంచుతాం అని చెప్పిన పెన్షన్ ఎంత? ప్రస్తుతం ఇస్తున్నది ఎంత అంటూ లంకా దినకర్ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.

పెంచింది లో లెవెల్ లో అయినా ప్రచారం మాత్రం పీక్ లెవల్లో
అత్తెసరు పెన్షన్ పెంపు కూడా ప్రభుత్వ ధనంతో తన ఫోటో కనబడటం కోసమే జగన్ పత్రిక ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ పేమెంట్ పెంచింది లో లెవెల్ లో అయినా ప్రచారం మాత్రం పీక్ లెవల్లో అంటూ లంకా దినకర్ జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడానికన్నా, పీకడానికి కసరత్తులు ఎక్కువ చేశారని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెంచింది 250 కానీ ప్రచార ఆర్భాటానికి లక్షల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఆగ్రహం
జగన్ మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచి నానా హంగామా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకు పడుతున్నారు. ఇక అవ్వా తాతలకు మూడు వేళా రూపాయలు ఇవ్వలేని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతారా అంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీఎం జగన్ కేవలం 250 రూపాయలు పెంచి లక్షల రూపాయల ప్రజా ధనాన్ని ప్రచార ఆర్భాటాలకు వృధా ఖర్చు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు .

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ పెంపు కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్
ఇదిలా ఉంటే నూతన సంవత్సర శుభవేళ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో వైయస్సార్ పెన్షన్ కానుక పెంపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను వృద్ధులకు సీఎం జగన్ పంపిణీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెన్షన్ పంపిణీ
అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్ పైనే చేశారని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు జనవరి ఒకటవ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు 250 రూపాయల పెన్షన్ లో అదనంగా పెంచుతూ మొత్తం 2,500 రూపాయల పెన్షన్ ను వారికి అందించనున్నారు జనవరి ఒకటవ తేదీ నుండి 5 రోజులపాటు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications