అశోక్ గజపతిరాజుపై అలానా! అసలు మోడీకి పట్టుందా?: తులసీ రెడ్డి

పార్లమెంటులో గురువారం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుపై శివసేన ఎంపీల దురుసు ప్రవర్తించడం చాలా విచారకరమని కాంగ్రెస్‌ సీనియర్ నేత తులసీరెడ్డి అన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

విజయవాడ: పార్లమెంటులో గురువారం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుపై శివసేన ఎంపీల దురుసు ప్రవర్తించడం చాలా విచారకరమని కాంగ్రెస్‌ సీనియర్ నేత తులసీరెడ్డి అన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

విజయవాడలో శుక్రవారం తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడైన అశోక్‌గజపతిరాజుపై సహచర మంత్రి దురుసుగా ప్రవర్తించడం చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీకి తన కేబినెట్‌పై పట్టు లేదనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

lasi reddy on Ashok Gajapathi Raju parliament issue

శివసేన ఎంపీలపై పార్లమెంటు స్పీకర్‌ తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తులసీరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎయిరిండియా విమాన సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విచారణ జరుగుతుందని, ఆ వివాదంలో జోక్యం చేసుకోబోమని అశోక్ గజపతిరాజు చెప్పిన అనంతరం కేంద్రమంత్రి అనంత్ గీతేతోపాటు పలువురు శివసేన ఎంపీలు ఆయనవైపు దూసుకొచ్చి దాడి చేసినంత పని చేశారు.

కాగా, ఆ తర్వాత శివసేన ఎంపీ గైక్వాడ్.. క్షమాపణలు చెబుతూ అశోక్ గజపతి రాజుకు లేఖ రాయడం గమనార్హం. ఇది ఇలా ఉండగా, పార్టీ ఫిరాయింపులకు పూర్తి వ్యతిరేకి అయిన ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+