మంత్రి మేకపాటి చివరి ప్రసంగం: వైఎస్ జగన్ గురించి ఏం చెప్పారంటే: రాజకీయ ప్రవేశం పైనా
అమరావతి: రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం ప్రజలకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున మొన్నటిదాకా దుబాయ్ ఎక్స్‌పోలో తీరిక లేకుండా గడిపిన ఆయన ఇవ్వాళ లేరు అనే విషయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేకపాటి కుటుంబం అభిమానులు జీర్ణించుకోలేకపోతోన్నారు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు.
Recommended Video

పెట్టుబడుల కోసం
నిన్నటిదాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో విస్తృతంగా సదస్సుల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ఉద్దేశించిన సమావేశాల్లో పాల్గొన్నారు. దుబాయ్, అబుధాబిల్లో అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వం పనితీరు గురించీ వివరించారు.

దుబాయ్ ఎక్స్‌పోలో..
దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా అబుధాబిలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ స్థాయి సెమినార్‌లో మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అందులో ప్రసంగించారు. అదే ఆయన చివరి ప్రసంగంగా భావిస్తున్నారు. ఈ సెమినార్ తరువాత ఆయన విదేశీ పెట్టుబడిదారులతో వరుసగా సమావేశాలను నిర్వహించారు. వేదిక మీద చేసిన ప్రసంగం మాత్రం ఇదే చివరిదని అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి మేకపాటి ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
అగ్రగామిగా ఏపీ..
డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా దూసుకెళ్తోందని మేకపాటి అన్నారు. మూడు సంవత్సరాల కిందటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి విధానాలను అనుసరించాలనే విషయంపై తమ ముఖ్యమంత్రికి స్పష్టమైన విజన్ ఉందని పేర్కొన్నారు. తాను ఓ మంత్రిగా ఈ సెమినార్‌కు హాజరు కాలేదని, ఓ పారిశ్రామికవేత్తగా మాట్లాడుతున్నానని చెప్పారు.
వైఎస్ జగన్‌కు స్పష్టత..
వైఎస్ జగన్‌కు వాస్తవ పరిస్థితులను సమూలంగా అర్థం చేసుకున్నారని, ఎక్కడ, ఎలాంటి ఆడంబరాలకు పోకుండా.. ఉన్న పరిస్థితులను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోన్నారని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయం మీద స్పష్టమైన అవగాహనను కలిగి ఉన్నారని అన్నారు. ఆయన సారథ్యంలో ఏపీ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉందని మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

కేబినెట్ బెర్త్..
తాను రాజకీయాల్లోకి ప్రవేశించడం అదృష్టంగా భావిస్తున్నానని, వైఎస్ జగన్ కేబినెట్‌లో బెర్త్ లభిస్తుందని అనుకోలేదని మేకపాటి అన్నారు. కీలకమైన శాఖ బాధ్యతలను తనకు అప్పగించారని, రాష్ట్రాభివృద్ధిలో తానూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కాగా- తన దుబాయ్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన వైఎస్ జగన్‌ను కలవాల్సి ఉంది. ఈ లోపే కన్నుమూశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications