• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నన్ను శిక్షించండి...శ్రీవారి ఆస్తులు కాపాడండి:ఈవో స్పందనకి రమణ దీక్షితుల ప్రతిస్పందన

By Suvarnaraju
|

తిరుమల:వయో పరిమితి నిబంధన కారణంగా అర్థాంతరంగా ప్రధాన అర్చక పదవి నుంచి రిటైరైన రమణ దీక్షితులు తిరుమల వేంకటేశ్వరుని ఆభరణాల భద్రత విషయమై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

అంతకుముందు రమణ దీక్షితుల ఆరోపణలపై టిటిడి ఈవో వివరణ ఇస్తూ స్వామి వారి ఆభరణాలను ప్రజల ముందు ఉంచేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈవో వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే రమణ దీక్షితులు మరోసారి మీడియా ముందుకు వచ్చి తరతరాలుగా శ్రీవారి ఆభరణాలను అర్చకులు కాపాడుతూ వచ్చారని అన్నారు. 1996లో మిరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే స్వామివారి ఆభరణాలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు.

వివాదం...ఈవో సింఘాల్ స్పందన

వివాదం...ఈవో సింఘాల్ స్పందన

స్వామివారి ఆభరణాల నిర్వహణ విషయమై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టిటిడి ఈవో అనిల్ సింఘాల్ మాట్లాడుతూ ఈ ఆరోపణలపై జస్టిస్‌ వాద్వా,

ఎం. జగన్నాథరావు కమిటీలు వేశారని చెప్పారు. 1952 నుంచి తిరుమలలో ఉన్న ఆభరణాలు, దస్త్రాలను కమిటీ పరిశీలించిందని తెలిపారు. స్వామి వారి ఆభరణాలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నట్లు ఆయన వివరించారు. అయినా ఈ విషయమై వివాదం రేగినందున అవసరమైన పక్షంలో శ్రీవారి ఆభరణాలను ప్రజల ముందు ఉంచేందుకు తమకు ఎట్టి అభ్యంతరం లేదన్నారు. మరోవైపు వయస్సును కారణంగా చూపుతూ అర్చకుల పదవీ విరమణ చేపట్టడం వివాదాస్పదం కావడం పైనా టిటిడి ఈవో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో ప్రకారమే 65 ఏళ్లు నిండిన అర్చకులతో ఈ విధంగా పదవీ విరమణ చేయించినట్లు ఈవో అనిల్‌ సింఘాల్‌ వెల్లడించారు. అలా పదవీ విరమణ చేసిన భక్తవత్సలం, నర్సింహ దీక్షితులు, రామచంద్ర దీక్షితులతో పాటు మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించగా అర్చకుల వాదనలు విన్న న్యాయస్థానం అర్హత, ఖాళీలు చూసుకుని వారికి అవకాశాలు కల్పించాలని తీర్పు ఇచ్చిందని ఈవో తెలిపారు.

రమణ దీక్షితులు...మరోసారి...ప్రశ్నలు

రమణ దీక్షితులు...మరోసారి...ప్రశ్నలు

తన ఆరోపణలపై ఈవో అనీల్ సింఘాల్ స్పందించి వివరణ ఇచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. తరతరాలుగా శ్రీవారి ఆభరణాలను అర్చకులు కాపాడుతూ వచ్చారని అన్నారు. 1996లో మిరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే స్వామివారి ఆభరణాలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాస్త్రానికి విరుద్దమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22రోజుల పాటు పోటును ఎందుకు మూసివేశారని నిలదీశారు. పోటులో స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు చేస్తారని వెల్లడించారు.

అన్ని రోజులా?...ఆ బండల కింద ఏమున్నాయి?

అన్ని రోజులా?...ఆ బండల కింద ఏమున్నాయి?

ఇటీవల ఆ పోటును మూసివేశారని, తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని.. కేవలం తయారుచేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. స్వామివారిని పస్తులుంచడం సరికాదని, ఆగమ శాస్త్రాలకు అది విరుద్దం అని వ్యాఖ్యానించారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్ళు తొలగించాల్సిన అవసరం ఏంటని...వాటి కింద ఏమున్నాయని ప్రశ్నించారు. మరమ్మత్తుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరం అంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మత్తులు చేయడం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.

వజ్రం పగులుతుందా?...ప్రశ్న

వజ్రం పగులుతుందా?...ప్రశ్న

ఐదు పేట్ల ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని, గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, వజ్రం పగలడం జరుగుతుందా అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇటీవల జనీవాలో వేలం వేసిన వజ్రం ఇక్కడిదే అయి ఉండచ్చొని అనకు అనుమానంగా ఉందని, ఇకవేళ ఇక్కడిదే అయితే దానిని ఎవరు దేశం దాటించారో తనకు తెలియదని అన్నారు. తాను ఈ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఇరువై రెండేళ్లలో ఎన్ని మణులు, మాణిక్యాలు కనిపించకండా పోయాయని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టేదని నిలదీశారు. ఇలాంటి తప్పిదాల కారణంగానే స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని, అలా జరిగితే భక్తులకు అనుగ్రహం దొరకదని అన్నారు.

నన్ను శిక్షించండి...ఆస్తులు కాపాడండి

నన్ను శిక్షించండి...ఆస్తులు కాపాడండి

వెయ్యికాళ్ల మండపం తొలగించకూడదని చాలాసార్లు చెప్పామని, శిల్ప సంపదతో కూడిన మండపాన్ని కాపాడాలని కోరినా కూడా ఫలితం లేకుండా పోయిందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రథ మండపాన్ని కూడా తొలగించేశారని అన్నారు. వీటన్నింటిని ప్రశ్నిస్తున్నందుకే తనని పదవి నుంచి తొలగించారని చెప్పారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు బదులు కొత్త నగలు ఎందుకు వాడుతున్నారని రమణ దీక్షితులు ప్రశ్నించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ప్రాకారాలను ఎందుకు తవ్వారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందన్నారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లు కాదని, సంభావణ కింద పనిచేస్తామని తెలిపారు. తాను తప్పులు చేస్తే శిక్షించాలని.. కానీ శ్రీవారి ఆస్తులను కాపాడాలని కోరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thirumala: Retired tirumala temple chief priest has once again made sensational allegations about TTD jewelery management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more