Latest Survey: ఉమ్మడి తూర్పుగోదావరిలో కూటమి పరిస్ధితి ఏంటి ? తాజా సర్వేలో..!

ఏపీలో స్ధానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. దీంతో అధికార కూటమి పార్టీలతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా పోటీ చేసే అభ్యర్ధులతో పాటు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలోనూ అధికార కూటమి పరిస్ధితి ఎలా ఉందో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీకీ, కూటమి పార్టీలకు సన్నిహితంగా ఉంటారని పేరున్న సర్వే నిపుణుడు, రైజ్ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట తన తాజా సర్వే (Latest Survey) వివరాలను జిల్లాల వారీగా వెల్లడిస్తున్నారు.

AP Survey 2026: ఏపీలో ఎవరెక్కడ ? స్థానిక పోరు వేళ తాజా సర్వే..! షాకింగ్ ఫలితాలు..!
AP Survey 2026: ఏపీలో ఎవరెక్కడ ? స్థానిక పోరు వేళ తాజా సర్వే..! షాకింగ్ ఫలితాలు..!

ఇదే క్రమంలో ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి తాజా సర్వే వివరాలను బయటపెట్టారు. ఇందులో ప్రస్తుతం విభజన తర్వాత విడిపోయిన మూడు జిల్లాల వారీగా సర్వే వివరాలు వెల్లడించారు. ముందుగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కూటమి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలుగా రాజోలు, పి గన్నవరం, రామచంద్రాపురంను పేర్కొన్నారు. అలాగే సేఫ్ జోన్లో ఉన్న నియోజకవర్గాలుగా ముమ్మిడివరం, కొత్తపేటను ఇచ్చారు. మిశ్రమ స్పందన ఉన్న నియోజకవర్గంగా అమలాపురాన్ని ఇచ్చారు. ఇందులో రాజోలు, పి.గన్నవరం జనసేన చేతిలో, మిగతావి టీడీపీ చేతిలో ఉన్నాయి.

Latest Survey NDA s Position Across United East Godavari Safe Seats vs At-Risk Seats
కేకే సర్వే కిరణ్ సంచలనం- ఏపీ స్థానిక పోరులో పోటీకి అభ్యర్ధులు..!
కేకే సర్వే కిరణ్ సంచలనం- ఏపీ స్థానిక పోరులో పోటీకి అభ్యర్ధులు..!

తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే కూటమి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలుగా రాజానగరం, కొవ్వూరు, నిడదవోలును ఇచ్చారు. సేఫ్ జోన్లో ఉన్న సీట్లుగా గోపాలపురం, రాజమండ్రి రూరల్ ను ఇచ్చారు. చివరిగా మిశ్రమ స్పందన ఉన్న సీట్లుగా అనపర్తి, రాజమండ్రి సిటీని ఇచ్చారు. ఇందులో రాజానగరం, నిడదవోలు జనసేన సీట్లు కాగా... మిగతావి టీడీపీ సీట్లు. అలాగే కాకినాడ జిల్లాలో చూస్తే కూటమి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలుగా తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీని ఇచ్చారు. అలాగే సేఫ్ జోన్లో ఉన్నవిగా పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలను ఇచ్చారు. ఇందులో కాకినాడ రూరల్, పిఠాపురం జనసేన సీట్లు కాగా.. మిగతావి టీడీపీ సీట్లు, అలాగే అనపర్తి బీజేపీ సీటు. కాకినాడ జిల్లాలో కూటమి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+