ఏడాది కూటమి పాలనపై మరో సర్వే..! ఉత్తరాంధ్రలో డేంజర్ జోన్ లో వీరే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం చవి చూపించిన ప్రజలు.. కూటమిని పూర్తిగా నెత్తిన పెట్టుకున్నారు. 175 సీట్లకు గానూ ఏకంగా 164 సీట్లలో విజయాన్ని కట్టబెట్టారు. అయితే తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి తాజా సర్వేలు షాకులిస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి కచ్చితంగా గెలుస్తుందని అంతే కచ్చితంగా చెప్పిన సర్వే సంస్థలు ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోతోందని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రముఖ సర్వే సంస్థ రైజ్ తన అంచనాలను వెల్లడించింది. రైజ్ సర్వే సంస్థ నడుపుతున్న ప్రవీణ్ పుల్లట తాజాగా ఈ వివరాలు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 17 మంది కూటమి ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. ఇందులో 9 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఏడాది పాలన సందర్భంగా..ఉత్తరాంధ్ర రైజ్ సర్వే ఫలితాలు అంటూ ఈ లెక్కల్ని ప్రవీణ్ పుల్లట విడుదల చేశారు. అలాగే నాలుగు ప్రాంతాలనుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింట్ ఇచ్చారు. త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల లెక్కల్ని విడుదల చేసేందుకు రైజ్ సంస్థ సిద్దమవుతోంది. దీంతో రైజ్ సర్వే ఫలితాలు కచ్చితంగా కూటమి పార్టీల పెద్దలకు మింగుడు పడేలా కనిపించడం లేదు.
ఏడాది పాలన సందర్భంగా..
— Praveen Pullata (@praveenpullata) June 7, 2025
ఉత్తరాంధ్ర రైజ్ సర్వే ఫలితాలు 👇
17 మంది కూటమి ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత..9మందిపై తీవ్రమైన వ్యతిరేకత..
నాలుగు ప్రాంతాలనుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం.. stay tuned
వాస్తవానికి సర్వే సంస్థలు చెబుతున్న దాంట్లో ఓ కీలకమైన విషయం కామన్ గా ఉంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఎక్కువగా ఉందనేది ఇందులో ముఖ్యమైన అంశం. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేలకు ఎన్డీఏ భేటీల్లో చెబుతూనే వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయినా పలువురు ఎమ్మెల్యేలు ఇంకా తమ పనితీరు మార్చుకోవడం లేదని తాజా సర్వేలు చెప్తున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications