అది ఎన్టీఆర్‌తో మైత్రి బంధమే: అక్కినేనిపై లక్ష్మీపార్వతి

చాణక్య, చంద్రగుప్తులు: బాబుమోహన్
తెలుగు చిత్ర రంగానికి రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ మనల్ని వదిలి పెట్టి వెళ్లిపోయారని అయితే, వారిద్దరు స్వర్గంలో కలుసుకున్నారని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాబుమోహన్ అన్నారు. అక్కినేని తనను రెండుమూడుసార్లు మాత్రమే పేరు పెట్టి పిలిచి ఉంటారని గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్, ఎఎన్నార్‌లు నటించిన చాణక్య చంద్రగుప్తులను చూసి మురిసిపోయానన్నారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలంటే వీరే అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతికలగాలని, ఆ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని తాను దేవుడిని కోరుకుంటున్నానన్నారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
అక్కినేని నాగేశ్వర రావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి డికె అరుణ చెప్పారు. అక్కినేని భౌతికకాయాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications