మర్యాదల కోసం నాయకుల పోటీ, లోకేష్‌ను తోసేసిన కార్యకర్తలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: ఏపీ టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ప్రకాశం జిల్లా పర్యటనలో నాయకులు పోటీపడ్డారు. ఆయనకు గౌరవ మర్యాదల విషయంలో పలువురు నేతలు పోటీ పడ్డారు.

'పాదయాత్ర ముగియకుండానే జగన్‌ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం'

ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో నారా లోకేష్

ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో నారా లోకేష్

నారా లోకేష్ ప్రకాశం జిల్లాలో మంగళ, బుధవారాలు పర్యటించారు. బుధవారం సాయంత్రం వరకూ ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత విజయవాడకు వెళ్లారు.

లోకేష్‌కు మర్యాదల కోసం నాయకుల పోటీ

లోకేష్‌కు మర్యాదల కోసం నాయకుల పోటీ

నారా లోకేష్ పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌ పాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. లోకేష్‌ పర్యటనల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం లోకేష్‌కు మర్యాదల చేసేందుకు పోటీపడ్డారు.

పర్సులు కొట్టేసిన దొంగలు

పర్సులు కొట్టేసిన దొంగలు

లోకేష్ పర్యటనలో దొంగల బెడద కూడా కనిపించింది. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావుతోపాటు ముగ్గురు జిల్లా అధికారుల పర్సులు కొట్టేశారు. మంత్రి లోకేష్‌ ప్రయివేటు పీఎస్‌ సెల్‌ఫోన్ దొంగిలించారు. ఓవైపు పర్యటన జరుగుతుండగా మరోవైపు దొంగలు తమ పని కానిచ్చారు.

లోకేష్‌ను తోసేసిన కార్యకర్తలు

లోకేష్‌ను తోసేసిన కార్యకర్తలు

బుధవారం నారా లోకేష్ కర్నూలు రోడ్డు ఫ్లైవోవర్‌ వద్ద తెలుగుతల్లి, ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సమయంలో కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించి లోకేష్‌తోపాటు దామచర్లను తోసేశారు. కార్యకర్తలను, నాయకులను నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Leaders competition to honor Andhra Pradesh IT Minister Nara Lokesh in Prakasam district on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి