RRR ఎఫెక్ట్ : దెబ్బకు వైసీపీ జెండానా?, టీడీపీ జెండానా? రామరామ సీతా రామ్, అయ్యా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో హాట్ టాపిక్ లో నిలిచిన నియోజక వర్గాల్లో పుంగనూరు ఒకటి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గం గురించి సమాచారం తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మదనపల్లె నియోజక వర్గానికి, కర్ణాటక సరిహద్దులో ఉన్న పుంగనూరు నియోజక వర్గానికి ప్రతి నెల లక్షలాది మంది కన్నడిగులు వచ్చి వెలుతుంటారు.
అన్ని లక్షల మంది కన్నడిగులు పుంగనూరు నియోజక వర్గానికి ఎందుకు వచ్చి వెలుతున్నారు ? అని అందరికి అనుమానం వస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తరువాత అంత ప్రసిద్ది చెందిన దేవాలయం బోయకొండ ఇదే పుంగనూరు నియోజక వర్గంలోని చౌడపల్లె మండలంలో ఉంది. బోయకొండ గంగమ్మను దర్శించుకోవడానికి ఆదివారం, గురువారంతో మాత్రమే లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాగే వారంలోని ప్రతి రోజు లక్షల మంది శ్రీబోయకొండ గంగమ్మ భక్తులు పుంగనూరు నియోజక వర్గంలోని బోయకొండకు వచ్చి వెలుతున్నారు.

పునుపెన్నడూ లేని విదంగా ఇప్పుడు బోయకొండను చాలా అభివృద్ధి చేశారు. పుంగనూరులో వరుసగా ఎమ్మెల్యే అవుతున్న పెద్దిరెడ్డి మంత్రి కూడా కావడంతో ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, మరోసారి ఎమ్మెల్యే అయ్యి చక్రం తిప్పాలని పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడించానికి ప్రయత్నిస్తున్న పెద్దిరెడ్డికి నిద్రలేకుండా చేస్తానని ఇప్పటికే చంద్రబాబు చాలెంజ్ చేశారు.
పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పేరు ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా ముందు నుంచి పోటీ పడుతున్న చల్లా ఫ్యామిలీలో నుంచి చల్లా రామచంద్రా రెడ్డి అలియాస్ చల్లా బాబు పుంగనూరులో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ముందు నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో పెట్టుకుని వార్తల్లో నిలుస్తున్న బోడే రామచంద్రా యాదవ్ కూడా ఆయన సొంత పార్టీ సింబల్ తో పుంగనూరులో పోటీ చేస్తున్నారు.

పుంగనూరు నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టీడీపీ నుంచి చల్లా రామచంద్రా రెడ్డి, సొంత పార్టీ నుంచి బోడే రామచంద్ర యాదవ్ పోటీలో ఉన్నారు. ముగ్గురు రామచంద్రాలు ఇప్పుడు పుంగనూరు నుంచి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి రామచంద్రా పేరుతోనే ముగ్గురు పోటీలో ఉండటంతో పుంగనూరులో ఎక్కడ చూసినా రామచంద్ర పేరు నానుతుండటంతో రామచంద్రా అనే పేరు హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించడానికి ఆయన వ్యతిరేకులు అంతా ఒక్కటి అవుతున్నారు. మాజీ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ, మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి ఫ్యామిలీతో పాటు చల్లా ఫ్యామిలీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. మొదటి నుంచి పుంగనూరులో పెద్దారెడ్డి పెత్తనం ఏమిటి అంటూ తిరగబడుతున్న బోడే రామచంద్రా యాదవ్ సైతం ఇప్పుడు పెద్దిరెడ్డికి పోటీగా రంగంలో ఉన్నారు. మొత్తం మీద ముగ్గురు రామచంద్రుల్లో ఏ రామచంద్ర పుంగనూరులో జెండా ఎగరేస్తారు ? అని స్థానిక ఓటర్లతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications