జేడీయూలో చిచ్చుపెట్టిన వక్ఫ్ బిల్లు ? సీనియర్ల రాజీనామాల పర్వం.. !
కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షం జేడీయూలో వక్ఫ్ బిల్లు చిచ్చు రేపింది. పార్లమెంట్ ఉభయసభల్లో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా నిలిచిన జేడీయూ తీరుకు నిరసనగా ఆ పార్టీకి సీనియర్ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. దీంతో పార్టీలో దీనిపై అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న జేడీయూకు ఇది గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడంపై బీజేపీ సంతోషంగా ఉంది. మరోవైపు జేడీయూలో మాత్రం ఈ నిర్ణయం చిచ్చు రేపుతోంది. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతుకు నిరసనగా ఆ పార్టీకి సీనియర్ నేతలు రాజు నయ్యర్, తబ్రేజ్ సిద్ధిఖీ అలీగ్, మహ్మద్ షానవాజ్ మాలిక్, మహ్మద్ కాసిం అన్సారీలు ఇప్పటికే పార్టీతో సంబంధాలు తెంచుకున్నారు. ఇదే వరుసగా ఇవాళ మరో సీనియర్ నేత నదీం అఖ్తర్ కూడా చేరిపోయారు. దీంతో వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తర్వాత మొత్తం ఐదుగురు సీనియర్లు జేడీయూకు గుడ్ బై చెప్పినట్లయింది.

జేడీయూకు గుడ్ బై చెబుతున్న సీనియర్లు పార్టీ అధినేత నితీశ్ కుమార్ కు రాస్తున్న రాజీనామా లేఖల్లో ముస్లిం సమాజానికి ఆయన తీవ్ర ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు. ముస్లింల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని విమర్శిస్తున్నారు. జేడీయూ ఇంతకాలం సెక్యులర్ పార్టీ అని తమ వంటి ఎంతో మంది నమ్మారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం చెదిరిపోయిందని ఆక్షేపించారు. లక్షల మంది ముస్లింలను నితీశ్ కుమార్ ముంచేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ముస్లింలు పూర్తిగా జేడీయూకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ జేడీయూలో కొనసాగిన ముస్లిం నేతలు ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతును మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అసలే ఎన్నికల సమయం కాబట్టి వీరంతా కాంగ్రెస్ లేదా ఆర్జేడీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications